రాష్ట్రంలో ఇప్పుడు పరిణామాలు అన్ని వైసీపీ కి అనుకూలంగా మారిపోయాయి.. సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఎలా అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు.. ముఖ్యమంత్రి అయ్యాక అయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆయన్ని ఇంత ప్రజాదరణ పొందేలా చేశాయని చెప్పొచ్చు.. ఇక గత కొన్ని రోజులుగా బీజేపీ పార్టీ కేంద్రంలో జగన్ తో తెగ రాయబారాలు జరుపుతుంది.. తమకు మద్దతు తెలిపేందుకే జగన్ ని ఇలా మచ్చిక చేసుకుంటున్నారని తెలిసిపోతున్నా జగన్ మనసులో ఏముందో తెలుసుకోవాల్సి ఉంది.. అయితే  ఎన్ని చెప్పినా, ఎన్ని విమర్శలు చేసినా జగన్ బీజేపీ కి మద్దతు తెలుపదానికి సముఖంగా ఉన్నాడని తెలుస్తుంది..

అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి బీజేపీ ని పల్లెత్తు మాట అనకుండా వస్తున్నాడు జగన్..అంతేకాదు జగన్ అధికారంలోకి రావడానికి బీజేపీ పార్టీ సపోర్ట్ చేసిందన్నవాళ్ళు లేకపోలేదు.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం జగన్ ను విమర్శిస్తున్న కేంద్ర బీజేపీ మాత్రం జగన్ పై మాట పడనీయట్లేదు..అంతేకాదు వైసీపీ కూడా కేంద్ర బీజేపీ ని విమర్శించవద్దని పార్టీ క్యాడర్ కి కూడా క్లియర్ గా జగన్ చెప్పారట..  ముఖ్యంగా మోడీ, అమిత్ షా లాంటి వారిని విమర్శించొద్దని జగన్ అన్నారట.. ఇక తాజాగా  జగన్ ఎన్డీయే లో చేరితే ఎలా ఉంటుంది, చేరకపోతే ఎలా ఉంటుంది అని లెక్కలేసుకుంటున్నారని తెలుస్తుంది..

బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయి. దీంతో వైసీపీ కేంద్రమంత్రివర్గంలో చేరుతుందా అని కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.. ఒకవేళ చేరితే ఇరు పార్టీ లకు పెద్దగా ఒరిగేదేమి లేదని మాత్రం తెలుస్తుంది..కానీ వైసీపీలో కొందరు మాత్రం మంత్రివర్గంలో చేరడమే బెటర్ అని భావిస్తున్నారు. ప్రత్యేక హోదా మోదీ ప్రభుత్వంలో సాధ్యం కాదని, దాని కోసం పట్టుబడుతూ వెళితే రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూరదని సూచిస్తున్నారు. కనీసం మంత్రివర్గంలో ఉంటే బడ్జెట్ లో గాని, నిధులు తేవడంలో గాని ఏపికి కొంత ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం వైసీపీ కేంద్రమంత్రివర్గంలో చేరకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు. మరి జగన్ నిర్ణయం ఎటువైపో చూద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి: