ఇక ఏపీ లో మొన్నటి ఎన్నికల ఫలితాలతో టీడీపీ పార్టీ భవిష్యత్ శూన్యం అని స్పష్టంగా తెలిసిపోతుంది.. ఎందుకంటే చంద్రబాబు తర్వాత పార్టీ ని నడిపించే సరైన నాయకుడు లేడు.. జగన్ కూడా ఇప్పటిలో అధికారంలోంచి దిగేలా కనిపించడం లేదు..దాంతో టీడీపీ తెలంగాణా లోలా ఏపీ లో పూర్తి గా తుడిచిపెట్టుకు పోయినట్లే అని చెప్పాలి.. ఏపీ లో కరోనా మొత్తం తగ్గిపోయే స్థితిలో ఉన్నా, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తిరిగే పరిస్థితి ఉన్నా టీడీపీ పార్టీ నేతలు మాత్రం ఆ సాకుతో గడప దాటకుండా సేవను దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు..

సరే నేతలు అంటే ఎదో అనుకుందాం పార్టీ అధినేతలు సైతం ఇంటిపట్టునే ఉంటూ చోద్యం చూస్తుండడం ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.. కరోనా అని ఎప్పుడైతే తొలి సారి పేరు వినపడిందో అప్పటినుంచే చంద్రబాబు, లోకేష్ లో ఇంట్లో ముసుగు తన్ని పడుకుంటున్నారు..ఎదో ఫార్మాలిటీ కి ఆన్ లైన్ రాజకీయాలు చేస్తున్నారు కానీ అందులో ఎలాంటి ఇంట్రెస్ట్ కనిపించడం లేదు.. పార్టీ ఓడిపోయినందుకు వారు అలా చేస్తున్నారా లేదా నిజంగానే కరోనా భయం వల్ల రావట్లేదా అన్నది తెలీట్లేదు..

ఇక పార్టీ బలోపేతానికి చంద్రబాబు ఇటీవలే కొన్ని  చర్యలు చేపట్టారు.. పార్లమెంట్ ఇంచార్జ్ లు నియమించడం, పార్టీ అధ్యక్షుడిని వంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.. ఏపీ లో పార్టీ ఆధ్యక్షుడిని మార్చిన చంద్రబాబు తెలంగాణా లో ఎల్ రమణకు మళ్ళీ పార్టీ పగ్గాలు అందించారు.. అయితే ఇది తెలంగాణా టీడీపీ నేతలకు ఏమాత్రం నచ్చడం లేదు.. వాస్తవానికి తొలిసారి ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడే  నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళుతున్నారన్న టాక్ బలంగా ఉంది. ప్రతిరోజూ పార్టీ కార్యాలయానికి వచ్చే అలవాటు రమణకు లేదన్నది ప్రధాన ఆరోపణ. తనకు తీరిక ఉన్నప్పుడు మాత్రమే పార్టీ కార్యాలయానికి వచ్చి పోతుంటారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకుడు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.మొత్తం మీద రెండో సారి అధ్యక్ష పదవికి వచ్చిన ఎల్ రమణ సారథ్యంలో పార్టీ ఎలా ముందుకు వెళుతుందన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: