ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ ల ఎత్తులు కొంత అపహాస్యంగా, నవ్వుతెప్పించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ జగన్ పై చేసే అతి కి ప్రజలకు నవ్వుకుంటున్నారు.. వచ్చే ఎన్నికల్లోనూ తాము గెలవలేమని తెలిసిన టీడీపీ కి ప్రతి విషయంలో జగన్ ను విమర్శించడం ఎంతవరకు విజ్ఞత వారికే తెలియాలి.. ప్రజలకు దగ్గరవ్వాలంటే ప్రజల సమస్యలు గుర్తించి ప్రభుత్వం పై పోరాడాలి తప్పా ఇలా అన్నిటికి సీఎం జగన్ కారణమంటే ఎలా అని ప్రజల్లోనే ఓ వర్గం వాదిస్తున్నారు.. ఇక ఇటీవలే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారన్న సంగతి తెలిసిందే..

పదవిలోకి వచ్చి రాగానే అయన నానా హంగామా చేసే ప్రయత్నం చేశారు.. అంతేకాదు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అచ్చెన్న టీడీపీ ని గెలిపించేస్తా అన్నట్లు మాట్లాడడం నవ్వు తెప్పిస్తుంది.. ..  టీడీపీ మాజీ మంత్రి, కీలక సభ్యుడు, చంద్రబాబు బంటు కుడి భుజం అయిన అచ్చెం నాయుడు ఇటీవలే  ఈ ఎస్ ఐ స్కాం కేసులో జైలుకి వెళ్లి చాలారోజుల తర్వాత విడుదల అయిన సంగతి తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ లో కలవరం సృష్టించిన ఈ ఎస్ ఐ స్కాం లో ప్రధాన నిందితుడిగా భావించి అచ్చెన్న ను పోలీసులు అరెస్ట్ చేయగా పలుమార్లు బైలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.. ఎట్టకేలకు ఇటీవలే నిభంధనలతో కూడిన బెయిల్ ని ఇవ్వగా వచ్చీ రాగానే ఆయనపై ఉన్న సింపతి ని చంద్రబాబు రాజకీయంగా వాడుకునేందుకు అధ్యక్షుడిని చేశారు..

ఇక  అచ్చెన్న వస్తే పార్టీ అధికారంలోకి వచ్చినట్లే అని కొంతమంది టీడీపీ నాయకులూ భావిస్తున్నారు.. అయితే వారికీ సరైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు.. ముఖాలు మారాయి తప్ప టీడీపీకి కొత్తగా వచ్చిన బలమేముంది అంటున్నారు.ఒకవేళ అచ్చేన్నా పార్టీ తరపున గట్టిగా మాట్లాడిన కూడా  ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళు సమయం ఉంది. అప్పటికి రాజు ఎవరో మంత్రి ఎవరో, అచ్చెన్నకు మంత్రి పదవి తప్ప వేరే విధంగా దక్కే చాన్సేలేదు. ఆ మంత్రి పదవిని ఆయన గత అయిదేళ్ళలో ఎటూ ఎంజాయ్ చేశారు కూడా. కనీసం ఉప ముఖ్యమంత్రి పదవిని మంచి శాఖలతో నంబర్ టూ ప్లేస్ గా తన ప్రభుత్వంలో ఇస్తాను అని చంద్రబాబు బలమైన హామీ ఏదైనా ఇస్తే అచ్చెన్నాయుడు ముందుకు ఉరుకుతారేమో. లేకపోతే అతి బలంగా ఉన్న వైసీపీ మీద నోరు చేసుకోవడానికి ఆయన తెగిస్తారా అన్నది కూడా ఒక ప్రశ్నగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: