ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ లోకి ప్రతిపక్ష నేతలు వెళ్ళడం సహజం.. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటే ఎలాంటి ఉపయోగం ఉండదు.. అధికార పార్టీ లోకి వెళితే సేవ అయిన, దోచుకోవడం అయినా ఎదో ఒకటి చేయొచ్చు.. అయితే మితిమీరిన చేరికలు ఎప్పటికీ ప్రమాదమే.. అధికార పార్టీ కూడా చూసుకుని ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవాలి.. అయితే  ఏపీ లో అయితే ఈ చేరికల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అవసరాన్ని మించి నాయకులూ వైసీపీ నాయకులూ చంద్రబాబు హయాంలో టీడీపీ నుంచి చేరారు.. దాంతో వారు ప్రజాగ్రహానికి గురి కాక తప్పలేదు..

టీడీపీ పార్టీ ని ప్రజలు చిత్తూ చిత్తుగా ఓడించి జగన్ గెలిపించారు ప్రజలు.. అయితే తాను అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ చంద్రబాబు చేసిన తప్పు చెయ్యట్లేదు.. ఒకవేళ ఎవరైనా టీడీపీ నాయకులూ రావనుకుంటే మాత్రం అయన  రాజీనామా అనే అస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చారు.. దాంతో చాలామంది ప్రతిపక్ష నేతలు రాజీనామాలు చేయడం ఇష్టం లేక పార్టీ కి సపోర్ట్ గా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు వైసీపీ కి మద్దతు తెలుపుతూ తమ కుటుంబ సభ్యులను వైసీపీ లోకి చేర్చారు. అయితే ఇలా వచ్చిన వారు టీడీపీ పై ఘాటుగా విమర్శలు చేయడం ఇప్పడు సర్వత్ర సంచలనాన్ని రేకెత్తిస్తుంది..

ఇక టీడీపీ లో కీలక నేత అయిన బోండా  ఉమా త్వరలో పార్టీ మారబోతున్నాడని వార్తలు ఇప్పుడు ఆసక్తి కరంగా ఉన్నాయి.. దాంతో ఇటీవల ప్రకటించిన పార్టీ కార్యనిర్వాహక వర్గంలో తనకు తగిన హోదా ఇవ్వలేదని బోండా అలకపూనినట్టు కనిపిస్తోంది. చివరకు చంద్రబాబు తీరు మీద ఆయన అసహనంతో ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ జగన్ ని ఎదుర్కోవడానికి సిద్ధపడిన తనకు తగిన హోదా రాలేదని వాపోతున్నట్టు చెబుతున్నారు. దానిని గ్రహించిన టీడీపీ అధినేత నేరుగా బోండా ఉమాకి ఫోన్ చేసి వివరణ ఇచ్చినట్టు కూడా చెబుతున్నారు. బోండా ఉమా మాత్రమే కాకుండా ఇంకా పలువురు కీలక నేతలు కూడా కినుక వహించినట్టు టీడీపీలో ప్రచారం సాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: