అవునూ.. బిర్లా కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ఓ రెస్టారెంట్ వారు వారికి భోజనం పెట్టకుండా మూడు గంటలు ఆలస్యం చేయడమే కాకుండా వారిని ఆ రెస్టారెంట్ నుండి బయటికి గెంటేశారట. అయితే ఆ విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌, బిలియనీర్‌ కుమార్‌ మంగళం బిర్లా కూతురైన అనన్య బిర్లా గాయనిగా, ఆర్టిస్టుగా తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. శనివారం ఆమె తన తల్లి నీరజా బిర్లా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కాలిఫోర్నియాలోని ప్రముఖ ఇటాలియన్‌- అమెరికన్‌ రెస్టారెంటుకు వెళ్లారు. ఈ క్రమంలో భోజనం ఆర్డర్‌ చేసిన తమను, గంటల కొద్దీ వెయిట్‌ చేయించారని, కస్టమర్లన్న కనీస మర్యాద లేకుండా అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెఫ్‌ ఆంటోనియా లొఫాసో నేతృత్వంలోని ఇటాలియన్‌ మూలాలున్న సదరు రెస్టారెంటు నిర్వాహకుల తీరును నెటిజన్ల దృష్టికి తీసుకువచ్చారు.
అయితే కూతురి ట్వీట్‌పై స్పందించిన నీరజా బిర్లా సైతం.. ''ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది.. అత్యంత అనుచితంగా ప్రవర్తించారు. కస్టమర్లతో ఇలా వ్యవహరించేందుకు మీకు ఎలాంటి హక్కు లేదు''అంటూ రెస్టారెంట్లు నిర్వాహకుల తీరును ఎండగట్టారు. అనన్య సోదరుడు ఆర్యమన్‌ బిర్లా కూడా ఈ విషయంపై స్పందించాడు. గతంలో తమకు ఎన్నడూ ఇలాంటి రేసిస్ట్‌ అనుభవాలు ఎదురుకాలేదని, జాతి వివక్ష ఉందన్న విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌లో (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌) 7.8 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 1,500 కోట్లు వెచ్చించనుంది. ఈ డీల్‌ ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌కు 7.8 శాతం వాటాలు దక్కే విధంగా ప్రిఫరెన్స్‌ షేర్లు జారీ చేయనున్నట్లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ తెలిపింది. షేరు ఒక్కింటి ధర రూ. 205గా ఉంటుందని పేర్కొంది. గురువారం నాటి షేరు ముగింపు ధర రూ. 153.4తో పోలిస్తే ఇది 33.6 శాతం అధికం. షేర్ల కేటాయింపు తర్వాత ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ ప్రస్తుత ప్రమోటర్ల వాటా 55.1 శాతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: