కోవిడ్ వైరస్ వచ్చి ఏడు నెలలు గడుస్తున్న కేసులు మాత్రం ఆగడం లేదు. ఈ 2020. ని  కరోనా సంవత్సరంగా ప్రకటించవచ్చు . అయితే కోవిడ్  వైరస్ విరుగుడు కనుగొనడం లో చాలా దేశాలు పరిశోధనలను ముమ్మరం  చేస్తున్నారు. అందులో భాగంగా మన దేశంలో భారత్ బయోటెక్ మనుషులపై ట్రయల్స్ ని మొదలు పెట్టేసింది. ఇప్పుడు అదే వరుసలో ప్రసిద్ధ యూనివర్సిటీ అయిన ఆక్స్‌ఫర్డ్ కూడా ఇప్పటికే రెండు ట్రయల్స్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకొని మూడవ ట్రయల్స్‌ను కొనసాగిస్తోంది . ఆక్స్‌ఫర్డ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి విడతను ఈ డిసెంబర్‌ నెలలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విదంగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు కృషి చేస్తున్నారు. అందుకు అవసరమైన అధికారిక అనుమతిని క్రిస్మస్‌లోగా పొందేందుకు ప్రయత్నాలను వారు ముమ్మరం చేశారు. వ్యాక్సిన్‌‌కు సంబంధించి మూడవ ట్రయల్స్‌‌ కూడా విజయవంతం అయితే గానీ వాళ్ళు కోవిడ్ టీకాని  ప్రజల ముందుకు  తీసుకురాలేరు.

అయితే కరోనా బారిన పడిన రోగులకు మరియు  వైద్య సేవలు అందిస్తూ  ఆ వైరస్‌ బారిన పడుతున్న వైద్య సిబ్బందికి, ఈ వ్యాక్సిన్ అత్యవసరంగా అందించాల్సిన అవసరం ఉన్నందున  మొదటి విడత కింద డిసెంబర్‌లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నామని ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్‌ ఆండ్రియన్‌ హిల్‌ మీడియాకు తెలిపారు.మూడవ విడత ట్రయల్స్‌ పూర్తి కాక ముందే మొదటి విడత వ్యాక్సిన్‌ డోసుల విడుదలకు అనుమతి కోరుతున్నామని, డిసెంబర్ నెలలోగా అనుమతి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మూడవ ట్రయల్స్‌ పూర్తయ్యాక దేశ ప్రజలతోపాటు మిగతా దేశాల ప్రజలకు వ్యాక్సిన్‌  2021 తొలినాళ్లలో తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రొఫెసర్‌ ఆండ్రియన్‌ వివరించారు..

మన దేశం లో కరోనా కేసులు తగ్గుతున్నాయని అంటున్నారు . అది ఎంత వరకు నిజమో మనకి తెలీదు .. కానీ దేశం మాత్రం ఇప్పటి వరకు పాఠశాలలను మరియు కళాశాలలను ప్రారంబించలేదు., సినిమా థియేటర్స్ ని ఓపెన్ చేసుకొమ్మని కేంద్రం ఆదేశాలు ఇచ్చినప్పటి వరకు ఏ ఒక్క థియేటర్ ఓపెన్ కాలేదు ..దీని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే అది వచ్చే లోపు కరోనా అంతం అయి పోయేలా ఉంది.  కానీ  వ్యాక్సిన్ వచ్చింది లేదు రోగులు బతికింది లేదు .కనీసం కరోనా ఉన్నపుడు అయినా వ్యాక్సిన్ తీసుకు వస్తే అది కనిపెట్టిన వారికీ ఉపయోగం . తీసుకునే రోగికి ఉపయోగం .చూడాలి మరి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో .  ఏ దేశం మొదట తీసుకు వస్తుందో . 

మరింత సమాచారం తెలుసుకోండి: