చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని  పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో చైనాలో శరవేగంగా వ్యాప్తి చెంది వరుసగా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది. చైనా లో ఎంత శరవేగంగా వైరస్ వ్యాప్తి చెందిందో  అంతే వేగంగా తగ్గుముఖం పట్టడం కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే కరోనా పుట్టినిల్లయిన చైనా పూర్తిగా కరోనా వైరస్ నుంచి కోలుకుంటే... చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచ దేశాలు మొత్తం అతలాకుతలం అవుతున్నాయి. ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ మహమ్మారి వైరస్ పట్టి పీడిస్తూనే ఉంది.




 రోజురోజుకు ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిపోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి.  అదే సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ మాత్రం దెబ్బతినలేదు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయేలా చేసి.. చైనా ఆర్థిక వ్యవస్థ ఎంతో దృఢంగా నిలబడాలనుకున్న ప్లాన్ లో  సక్సెస్ అయింది అని అటు విశ్లేషకులు కూడా విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకి  చికిత్స తీసుకుని కోలుకున్న వ్యక్తి మళ్లీ కరోనా వైరస్ బారిన పడుతున్న కేసులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి.



 అయితే ప్రస్తుతం చైనాలో కూడా సెకండ్ వేవ్ అయిందా అంటే ప్రస్తుతం చైనా చెబుతున్న లెక్కల ప్రకారం అవుననే టాక్ వినిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ గురించి ఇటీవలే ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చింది చైనా. చైనాలో మొన్న 18 నిన్న 28 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ లెక్కలు పై  విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్  విషయంలో ప్రపంచ దేశాలు చైనా పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో.. ఇప్పుడు ప్రపంచమంతా సెకండ్ వేవ్  వచ్చిన తర్వాత చైనాలో రాకపోతే ప్రపంచ దేశాలు చైనా పై మరో అనుమానం వ్యక్తం చేసే అవకాశం ఉంది కాబట్టి తమ దేశంలో కూడా కరోనా సెకండ్ వచ్చింది అని తప్పుడు లెక్కలు చెబుతూ చైనా ప్రపంచదేశాలను మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: