ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ పాకిస్తాన్. ఎప్పుడు మత రాజ్య స్థాపనే లక్ష్యంగా ఎన్నో నీచాతి నీచమైన చర్యలకు పాల్పడుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇస్లామిక్ దేశాల పై ఆధిపత్యం సంపాదించడం తో పాటు మరో వైపు.. శత్రు  దేశాలలో కూడా విధ్వంసం సృష్టించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఓవైపు ఐక్యరాజ్యసమితి మరోవైపు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఎఫ్ఏటీఎఫ్ ముందు ఎన్నో సార్లు దోషిగా నిలబడినప్పటికీ పాకిస్తాన్ మాట తీరును మార్చుకోవడం లేదు.  పాకిస్తాన్ చైనా కు బానిస దేశం గా మారిపోయిన విషయం తెలిసిందే.



 చైనా కు బానిస దేశం గా మారిపోయినప్పటి నుంచి మరింత అధ్వానంగా వ్యవహరిస్తుంది పాకిస్తాన్. తమ దేశ ప్రజల యొక్క ప్రయోజనాలను గాలికి వదిలేసి.. దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా అవగాహన వేయకుండా నిర్ణయాలు  తీసుకుంటూ రోజురోజుకు ప్రజల జీవన పరిస్థితి దారుణంగా దిగజారి పోయేలా చేస్తుంది.  ఈ క్రమంలోనే పాకిస్తాన్లోనే తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత్ పై పగ తీర్చుకోవాలనే  ఉద్దేశంతో పాకిస్తాన్ తీసుకుంటున్న నిర్ణయాలు.. పాకిస్తాన్ ను  బొక్క బోర్లా పడేలా చేస్తున్నాయి.



 పాకిస్తాన్ నిర్ణయాల వల్ల ఇప్పటికే ఆర్థిక సాయం చేస్తూ ఎప్పుడూ అండగా నిలిచే సౌదీఅరేబియా తమ సహాయాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ కి భారీ షాక్ తగిలింది. పాకిస్తాన్ కు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని అమెరికా నిలిపివేసింది. అమెరికా సహాయం  నిలిపివేసిన తర్వాత యూరోపియన్ యూనియన్ ఆర్థిక సహాయం నిలిపివేసే అవకాశం ఉందని.. దీంతో పాకిస్తాన్  పూర్తిగా చైనా మీద ఆధార పడే అవకాశం ఉంది అని విశ్లేషకులు అంటున్నారు ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చైనా పాకిస్థాన్ ను తమ  దేశ పరిధిలోకి తీసుకుంటుంది  అనే అంచనాలు కూడా వేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: