ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ  క్షణంలో ఇరుదేశాల మధ్య యుద్ధం జరుగుతుంది అన్నది కూడా ఊహకందని విధంగా ఉంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ సరిహద్దులలో మోహరింపులు  మాత్రం ఆపడం లేదు రెండు దేశాలు. ఒకవేళ చైనాతో కనుక యుద్ధం తలెత్తితే ఎంతో సమర్థవంతంగా యుద్ధం చేసి చైనాను మట్టి కనిపించేందుకు భారత సైన్యాన్ని మరింత పటిష్టం చేస్తుంది భారత ఆర్మీ. ఈ క్రమంలోనే భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన సరికొత్త ఆయుధాలను కూడా ప్రయోగాలు నిర్వహించి భారత అమ్ములపొదిలో చేరుస్తున్న విషయం తెలిసిందే.



 ఇక రోజు రోజుకు భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే బిజెపి నేత చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి. గతంలో భారత్ సరిహద్దులో తలెత్తిన వివాదాన్ని గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కిన  బిజెపి నేత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అనే విషయాన్ని కూడా చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత.



 భారత్-చైనా సరిహద్దుల్లో  యుద్ధానికి కేంద్రం ముహూర్తం డేట్ ఫిక్స్ చేసింది అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సంచలనంగా  చర్చనీయాంశంగా మారిపోయాయి. పొరుగు దేశాల అయినటువంటి పాకిస్తాన్ చైనాలతో సరిహద్దుల్లో  వున్న ఉద్రిక్తత నేపథ్యంలో ఆ రెండు దేశాల తో ఎప్పుడు యుద్ధానికి దిగాలి అనే విషయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో స్పష్టతతో ఉన్నారని.. ఈ మేరకు యుద్ధం కోసం తేదీలు కూడా ఖరారు అయిపోయాయని ఉత్తర ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు స్వతంత్ర దేశ్ సింగ్  వ్యాఖ్యలు చేశారు. కాగా బిజెపి నేత చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: