ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి ఇప్పుడు మరో పెద్ద సవాలు ఎదురైంది. రాష్ట్ర విభజన సమయంలో అన్యాయం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ కు ఒకే ఒక్క ఊరటగా పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించారు. పోలవరం డ్యామ్ తో పాటు భూ సేకరణ భూ పునరావాసం ఇలా మొత్తం ఖర్చులు భరించి ప్రాజెక్ట్ నిర్మించి ఇచ్చి వేసేందుకు నాడు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం అంగీకరించింది. కాని  తెలుగు దేశం తీసుకున్న నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఆలస్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వేగంగా నిర్మిస్తామంటూ నాడు ఎన్డిఏ లో మిత్ర పక్షంగా వున్న చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.


నాడు తెలుగు దేశం పార్టీ కూడా కేంద్రంలో భాగం కావడంతో ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలకు అంగీకరించింది. ఇక అవే ఇప్పుడు సమస్యకు మూల కారణమయ్యాయి. 2014 అంచనా వ్యయం ప్రకారం ఇస్తామన్న నిధుల్ని త్వరగా ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చిక్కుల్లో పడిందని తెలుస్తుంది.  

https://youtu.be/WVRhizvqQbY

మరింత సమాచారం తెలుసుకోండి: