బండి సంజయ్ ని తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా నియమించిన సమయం నుండి ఈ రోజు  వరకు ప్రతిక్షణం పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల రోజుకో సమస్య వచ్చి పడుతూ ఉంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. అయితే ఇదంతా ఇలా ఉంటే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. దీనితో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలలో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ... నిన్న దుబ్బాక ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా అతను బంధువుల ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. వీరు జరిపిన సోదాల్లో రూ.18.67 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులనుండి లాకెళ్ళుతూ పరుగులు తీశారు కార్యకర్తలు. దీనితో అక్కడ కొంచెం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులను సద్దుమణిగేలా చేయడానికి విషయం  తెలుసుకున్న బండి సంజయ్ హుటాహుటిన బీజేపీ కార్యకర్తలతో సిద్ధిపేటకు వెళ్తుండగా దారి మధ్యలో పోలీసులు ఈయనను అరెస్ట్ చేసారు.  

రఘునందన్ ఇంటి దగ్గర జరిగిన ఘర్షణలో ప్రభుత్వానికి మరియు పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ సమయంలో పోలీసులకు అలాగే బీజేపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. అయితే అప్పటికే అరెస్ట్ చేసిన బండి సంజయ్ ని సిద్దిపేట నుండి కరీంనగర్ కి తీసుకెళ్లారు  పోలీసులు. అయితే ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య జరగనున్న ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో అని ప్రముఖులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  మరి దీనిపైన తెలంగాణ ఎన్నికల సంఘం మరియు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందించనుందో తెలియాల్సి ఉంది. ప్రత్యక్షంగా బయటపడిన డబ్బు విషయంలో బీజేపీ అభ్యర్థిని డిస్ క్వాలిఫై చేస్తారా అన్నది ఇంకా తెలియలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: