అప్పుడప్పుడు రాజకీయ ప్రముఖుల ఇంటిపై రైడ్స్ జరుగుతుండడం చూస్తూనే ఉంటాం.... వీటికి గల కారణాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే రాజకీయాలలో ఇలాంటి సంఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. అసలు ఏమిజరిగిందో ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందామా...వివరాల్లోకి వెళితే తాజాగా ఓ రాజకీయ వేత్త ఇంటిపై పోలీసులు సోదాలు చేయడంతో... ఆయన ఇదేమి న్యాయం అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు.. ఇంతకీ ఎవరా అనుకుంటున్నారా...దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. సిద్దిపేటలో రఘునందన్‌రావు ఉన్న ఆయన ఇంట్లో, వారి అత్తారింట్లో మరియు బంధువుల ఇళ్లలో ముమ్మరంగా సోదాలు జరిపారు పోలీసులు.

కొంత సమయం తర్వాత ఈ సోదాల్లో రఘునందన్ రావు బంధువుల ఇంట్లో ఏకంగా రూ.18.67 లక్షలు డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న రఘునందన్‌రావు దుబ్బాకలో తన ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి  .....అక్కడి నుంచి ఆయన హుటాహుటిన సిద్దిపేటలోని తన అత్తారింటికి చేరుకున్నారు. అయితే ఇంట్లోకి వెళ్లడానికి ఆయన ఎంతగా ప్రయత్నించగా పోలీసులు ఆయన్ని లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారు. ఎంతకీ ఆయన్ని లోపలికి పంపించక పోవడంతో..రఘునందన్‌రావు కి మరియు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. అంతేకాదు వాదనలు జరుగుతున్న సందర్భంలో తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పోలీసులను దాటుకొని కొందరు కార్యకర్తలు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి పోలీసులు అప్పటికే స్వాధీనపరుచుకున్న నగదును లాకెళ్ళుతూ బయటకు పరుగులు తీశారు కార్యకర్తలు. అనంతరం ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. తన ఇంట్లో సోదాలు నిర్వహించినట్లే హరీశ్ రావు ఇంట్లో కూడా సోదాలు నిర్వహించాలని పోలీసులను డిమాండ్ చేశారు. మరి బీజేపీ కార్యకర్తలు ఈవిధంగా ఆందోళనలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: