టిడిపి నేత , మాజీ మంత్రి నారా లోకేష్ లో ఇంత మార్పు ఎందుకొచ్చిందో తెలియటం లేదు.. అధికారం ఉన్నప్పుడు పరమానం తిని, లేనప్పుడు ఆరాట పడతున్నట్లు ఉంది ఇప్పుడు తండ్రి కొడుకుల వ్యవహారం..ఏం చేసినా ప్రజల కోసమే అంటూ ఇప్పుడు చంకలు గుద్దుకుంటున్నారు.. ఒకప్పుడు వైఎస్సార్ పాద యాత్రను, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను తప్పు పడుతూ హేళన చేసిన వీళ్లే ఇప్పుడు ప్రజలను ఉద్దరిస్తాం అంటూ పరుగులు పెడుతున్నారు.



తండ్రి వయసు మీద పడటంతో  కూర్చొని సొంత డప్పు కొట్టుకుంటే...కొడుకు మాత్రం ఒంట్లో శక్తి.. ఊరంతా ముక్తి అని ఊరూరా తిరిగే బాటసారి అయ్యాడు. వీళ్ళ అదృష్టం ఏంటంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్ర ప్రదేశ్ చాలా వరకు నీట మునిగింది..రైతులు పంటలు మునిగి పోవడంతో తీవ్ర నష్టాలను చవి చూశారు..ఈ మేరకు లోకేష్ బాబు ఊరూరా తిరుగుతూ ఏదో చేద్దామని పోయి ఇంకేదో చేస్తున్నాడు.ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్‌లో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై కేసు నమోదైంది. అక్కడి రోడ్లపై అవగాహన లేకుండానే లోకేష్ వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు..



ఈ మేరకు ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారని కొందరు లోకేష్ పై పోలీస్ కేసు పెట్టారు.వివరాల్లోకి వెళితే..పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్.. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. ఈ సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను వెంటనే అదుపు చేశాడు.ఈ సంఘటనలో ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు..దీంతో లోకేష్‌పై ఐపీసీ 279,184, 54ఎ, ఎపిడమిక్‌ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన తో పాటుగా కరోనా నిబంధనలను పాటించలేదని పోలీసులు మరో కేసును కూడా ఫైల్ చేశారు..


మరింత సమాచారం తెలుసుకోండి: