ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం కరోనా  వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని  నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ వైరస్ తగ్గుముఖం పట్టలేదు కదా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి.  అంతేకాకుండా ఎంతోమంది మహమ్మారి వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి క్రమంలో వ్యాక్సిన్ వస్తే  కానీ ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చేలా కనిపించడంలేదు. దీంతో ప్రపంచ ప్రజానీకం మొత్తం వ్యాక్సిన్  ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసి శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజనికా  సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్  కూడా శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటుంది. గతంలో  ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ లో  దుష్ప్రభావాలు కనిపించడంతో ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భద్రతా ప్రమాణాలను సమీకరించిన తర్వాత మళ్లీ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టింది ఆక్స్ఫర్డ్. ఇక శరవేగంగా ఆక్స్ఫర్డ్ క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే అందరికీ ఒక గొప్ప శుభవార్త అందింది.



 ఆక్స్ఫర్డ్ ఫాస్ట్ ఆస్ట్రాజెనికా  సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్   మరో వారంలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బ్రిటన్ పత్రిక ది సన్  ఈ విషయాన్ని ప్రచురించింది. తొలి వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని  ఓ ప్రముఖ ఆసుపత్రికి ఆదేశాలు కూడా వెళ్లాయి  అంటూ ఈ వార్త పత్రిక ప్రచురించింది. అయితే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా ఇక సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ యువతతో పాటు వృద్ధుల్లో కూడా ఎంతో అద్భుతంగా ప్రభావం చూపుతూ పనిచేస్తుంది అని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ అదే నిజమైతే మాత్రం అందరికీ గొప్ప శుభవార్త అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: