త్వరలో తమిళనాడు ఎన్నికలు ఉన్న నేపధ్యంలో ఇప్పుడక్కడ ఎవరు విజయం సాధిస్తారో అనేదానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయంగా తమిళనాడులో అన్నా డీఎంకే బలంగా లేకపోవడం దానికితోడు బీజేపీ అన్నాడీఎంకే తో కలిసి ముందుకు వెళ్ళడంతో ఇప్పుడు ఆ పార్టీకి కష్టంగా ఉంది అనే చెప్పాలి. ముఖ్యమంత్రి పనితీరు ఈ విషయంలో అక్కడి ప్రజలు సంతోషంగానే ఉన్నా సరే కొన్ని కొన్ని పరిణామాలు మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనే మాట అక్షరాల నిజం.

ఇక రాజకీయంగా కూడా క్షేత్రస్థాయిలో డిఎంకె చాలా బలంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొన్ని వార్తలు చూస్తే కొంత మంది సినీ నటులు బీజేపీ తమ వైపు తిప్పుకునే విధంగా ప్లాన్ చేస్తోందని అంటున్నారు. బీజేపీ లోకి ఒక ఇద్దరు ప్రముఖ హీరోలు తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా చర్చలు జరిపారని వారు త్వరలోనే ఆ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాకపోయినా దాదాపుగా నవంబర్ రెండో వారంలో కొంతమంది అందులో చేరే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయంగా కూడా తమిళంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వారికి మంచి ఫాలోయింగ్ ఉందని వారికి మంచి సీట్లు ఆఫర్ చేశారని, అంతేకాకుండా మంత్రి పదవులు కూడా ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. అవసరమైతే రాజ్యసభ సీటు కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే కీలక అడుగు కూడా పడే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే తమిళనాడు రాజకీయాలు మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కాస్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చూడాలి మరి ఎవరు విజయం సాధిస్తారు ఏంటి అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: