తెలంగాణ దుబ్బాక ఉప ఎన్నికలు కూడా కాస్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజకీయంగా ఇప్పుడు ఎన్నికలు ఎటువంటి మలుపు తిరుగుతాయో అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నిన్న చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా మారాయి అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రధానంగా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ పోలీసులు వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ అధిష్టానం కూడా ఈ ఘటనలపై కాస్త ఎక్కువగానే ఫోకస్ చేసింది.

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో కాస్త ఇబ్బందికర వాతావరణం క్రియేట్ అయింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బిజెపి ని టిఆర్ఎస్ పార్టీ పార్టీ టార్గెట్ చేసిందని బీజేపీ కి అవకాశాలు ఉన్నాయి కాబట్టే ఆ పార్టీని టార్గెట్ చేసింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి పోటీ చేయడం రఘునందన్ రావు ఇంట్లో సోదాలు చేయడం వంటివి కాస్త వివాదాస్పదంగా మారాయి.

ముందు నుంచి కూడా రఘునందన్ రావుని టిఆర్ఎస్ పార్టీ ఎక్కువగా టార్గెట్ చేసింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన అనుచరులు కొందరిని డబ్బులతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని రఘునందన్ రావు స్పష్టం కూడా చేశారు. ఇక ఇప్పుడు మరో సారి ఆయనను టార్గెట్ చేయడంతో ప్రజలు బీజేపీకి కాస్త సానుభూతి కూడా వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ పరిణామాలు ఎటు మలుపు తిప్పుతాయి, ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: