అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది. దీనితో రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు రోజుకో విధంగా మారుతున్నాయి. కొన్ని రోజులు ట్రంప్ మళ్ళీ గెలుస్తాడు అని, మరి కొన్ని రోజులు అమెరికాకు కొత్త అధ్యక్షుడు రానున్నారని ఇలా రకరకాలుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. భారత ప్రధాని మోదీ ట్రంప్ కి మద్దతు పలుకుతున్నాడని విషయం అందరికీ తెలిసిందే. దీనితో ఒకింత ట్రంప్ కి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో ఉన్న భారతీయులు అంతా ట్రంప్ కి ఓటు వేస్తారా లేదా  అన్నది...మరి కొన్ని రోజులు వేచిచూడాలి....ఇప్పుడు తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.... అమెరికాలో ఉన్న పాకిస్థానీలు భారతీయులతో కలిసిపోయారు అని ప్రచారం జరుగుతోంది. మరి బద్దశత్రువులుగా వ్యవహరించే భారతీయులు మరియు పాకిస్థానీలు ఎందుకు ఒకటయ్యారు..దీని వెనుక మతలబేంటి తెలుసుకుందామా...అయితే కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ పై ఓ లుక్కేయండి.

భారత్, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉండటం వల్ల.. భారతీయులు, పాకిస్తానీయులు ఘర్షణపడుతుంటారని భావిస్తుంటారు. కానీ అమెరికాలో ఈ రెండు దేశాల ప్రజలు ఒకే దేశానికి చెందిన వారి లాగా కలిసి మెలసి ఉంటారు.  అంతేకాకుండా వీరు తరచూ రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే అమెరికన్ భారతీయ పాకిస్థానీలు గతంలో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కు మద్దతు పలికారు. ఈయన గెలిస్తే అమెరికాలో మరింత న్యాయం మరియు సమానత్వం ఉంటుందని భావించడమే కారణం. గతంలో భారత్ మరియు పాకిస్తాను లు విడిపోవడానికి కారణమయిన ఏ విషయం గురించి ఎప్పుడూ వీరు ఇరువురు చర్చించరట. దీనితో వీరి మధ్య ఎటువంటి విభేదాలకు తావులేకుండా వీరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది.  

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయినప్పటి నుంచీ.. ఇక్కడ మైనారిటీల వ్యతిరేక, జాతివివక్ష వాదనలు పెరిగాయని ఆయన విమర్శకులు అంటారు. ''ద్వేషం, వివక్ష, వలస వ్యతిరేక మనోభావాలు పెరగటంలో'' ట్రంప్‌ బాధ్యత ఉందని సయ్యద్ ఏకీభవిస్తారు. మరి ఇప్పుడు ప్రధాని మద్దతు ట్రంప్ ని గెలిపిస్తుందా  ...లేదా అమెరికన్ భారతీయ మరియు పాకిస్థానీల సంబంధాలు జో బైడెన్ ని అధ్యక్షుడిని చేయనున్నాయా... 

మరింత సమాచారం తెలుసుకోండి: