ఈ మద్య కరోన కేసులు వచ్చిన బయటికి చెప్పడం లేదు . దీని బట్టి చూస్తే కరోన కేసులు రావడం లేదనా ?లేదా  కరోన వచ్చేవారి శాతం తగ్గిందనా  . అసలు యే విషయం చెప్పడం లేదు . పండగ సందర్బం వచ్చిందని ప్రజల దృష్టిని మళ్ళించడం కోసం కరోన కేసులను దాచిపెడుతున్నారని స్పస్తంగా అర్థం అవుతుంది . ఇది ఇలాగే ఉంటే మరొకసారి కరోన విజృబించి కేసులు పెరిగిన వాటిని చెబితే ఈ ప్రజలు నమ్మరు .. చలి కాలం మొదలైంది  

కరోనా మరోసారి కోరలు చాస్తుందా? ఉధృతి తగ్గినట్లు కనిపిస్తున్న ఈ మహమ్మారి మరోసారి విజృంభిస్తుందా?... అంటే కరోనా 2.0  మొదలయ్యే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెల మూడు, నాలుగు వారాల్లో లేదా డిసెంబర్‌ మొదటి వారంలో కోవిడ్‌ ఉధృతి మళ్లీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఐరోపా  దేశాల్లో కోవిడ్‌  ప్రభావం క్రమంగా పెరుగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మనదేశంలో తొలిదశ కరోనా వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడం మొదలైందని, త్వరలోనే కరోనా 2.0  ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుందనే అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది.

పండుగల సీజన్‌లో వైరస్‌ వ్యాప్తిచెందకుండా ప్రజలు ఏమేరకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారనే దానిపై కరోనా తీవ్రత ఆధారపడి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నా, మరికొన్ని రాష్ట్రాల్లో 2 వారాలుగా అధిక కేసులు నమోదవుతున్నాయి. గతంలోనూ ఇదేవిధంగా నెమ్మదిగా  మొదలై ఆ తర్వాత కేసుల తీవ్రత, వైరస్‌ వ్యాప్తి పెరిగిందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు.

మనదేశం కరోనా బారినపడినపుడు ఇక్కడ ఎండాకాలం ఉందనేది గమనార్హం. సాధారణంగా వేసవిలో వైరస్‌ కొంత బలహీనంగా ఉంటుంది. ఇంకా మనం చలికాలంలోకి అడుగుపెట్టలేదు. ఉష్ణోగ్రతలు తగ్గడం మొదలయ్యాక వైరస్‌ స్వభావం ఎలా ఉంటుందనేది కీలకం కానుంది. భారీవర్షాలు, వరదల అనంతరం డెంగీ, టైఫాయిడ్‌ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు చలికాలంలో సాధారణంగానే ఇన్‌ఫ్లూయెంజా ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితులకు ఇవి కూడా తోడైతే సమస్య జఠిలమయ్యే ప్రమాదముంది. అందువల్ల ఫ్లూకు సంబంధించిన వ్యాక్సిన్‌ వేయించుకుంటే ముందు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది.

పండుగలలో ప్రజలు పెద్దసంఖ్యలో బయటకు వస్తున్నారు. కలుసుకోవడం, గుంపులుగా చేరడం పెరిగినందున ఇప్పుడు అప్రమత్తత అవసరం. ఇంకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానందున జాగ్రత్తలు ముఖ్యం. కొందరు కరోనా  ముగిసిందనే భావనలో మాస్క్‌లు ధరించడం లేదు. సామాజిక దూరం, శానిటైజేషన్‌ లాంటి జాగ్రత్తలు పాటించడం మానేశారు. దీనివల్ల మళ్లీ కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగే ప్రమాదముంది. పండుగల సందర్భంగా పెద్దసంఖ్యలో ఒకచోట గుమికూడటం, చేయొద్దు. మళ్ళీ కరోనా రాకుండా  ఇళ్లచుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రెండో సారి కరోనా విజృంబిస్తే మళ్ళీ భారత దేశం పాత స్థితికి రావడం దాదాపు ఆసాద్యమే . కరోనా 2.0 రాకుండా ఉండటం ప్రజలారా మీ .చేతిలోనే ఉంది . ఇప్పటి నుంచైనా జాగ్రతగా ఉండండి 

మరింత సమాచారం తెలుసుకోండి: