బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి విజయం అనేది చాలా అవసరం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కూడా కష్టపడుతుంది. అయితే ఆ పార్టీ అనుకున్న విధంగా అక్కడ పరిణామాలు కలిసి రావటం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రధానంగా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. పదిహేనేళ్ల నుంచి సీఎంగా ఉన్న నితీష్ కుమార్ అక్కడ నిరుద్యోగ సమస్య విషయమై దృష్టి పెట్టలేదు అని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక బిజెపితో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా పెద్దగా ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి లేదు అనే విషయం చెప్పవచ్చు. ఇక ప్రత్యేక హోదాతో కూడా అక్కడి ప్రజలలో కాస్త నితీష్ కుమార్ పై వ్యతిరేకత ఉండవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా గురించి ప్రతీ ఎన్నికల్లో కూడా హామీ ఇస్తున్నారు. అయితే అది సాధ్యం కావడంలేదు. ప్రత్యేకహోదా అనేది ఇప్పుడు చాలా రాష్ట్రాలకు అవసరం. అయితే బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

దీనితోనే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా అంగీకరించడం లేదు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కూడా వ్యక్తమవుతుంది. చాలా పెద్ద రాష్ట్రం కావడంతో ఆర్థిక రాష్ట్రం నుంచి కేంద్రానికి భారీగా ఆదాయం వస్తుంది. ఇక మరో సమస్య ఏంటి అంటే అక్కడ రాజకీయ స్థిరత్వం లేకపోవడం నితీష్ కుమార్ ఎప్పుడు సిఎం అయినా సరే స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు అని చెప్పాలి. దీనితో నితీష్ కుమార్ ఇప్పుడు అసలు ఐదేళ్లపాటు సీఎం గా ఉంటారా లేదా అని చెప్పడం కూడా చాలా కష్టంగానే ఉంది. దానికి తోడు ఆయన వయస్సు 75 ఏళ్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: