ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ వాడకం ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకు సెల్ఫోన్ వాడుతున్న వినియోగదారుల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. సెల్ఫోన్ ద్వారా ఎక్కడో జరిగిన అన్ని విషయాలను తెలుసుకోవడానికి అవగాహన పెంచుకోవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ సెల్ ఫోన్ కారణంగా మంచి జరగడం ఏమో కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చెడు  జరుగుతున్న ఘటనలు ఎక్కువగా తెర  మీదకి వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెల్ఫోన్ ఎంతో మంది భార్యా భర్తల జీవితంలో చిచ్చు  పెట్టిన ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చాయి. సెల్ఫోన్ కోసం గొడవలు పడి ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి.



 అంతేకాదు సెల్ఫోన్ కొనివ్వలేదని లేదా సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నందుకు తల్లిదండ్రులు మందలించారని అన్న కారణంతో ఎంతో మంది పిల్లలు కూడా బలవన్మరణాలకు పాల్పడుతు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు  రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా సెల్ఫోన్ ఒక మహిళ ప్రాణం తీసింది. అదే పనిగా చాటింగ్ చేస్తున్న భార్యను చాటింగ్ ఆపేయాలి అంటూ భర్త హెచ్చరించాడు. దీంతో మనస్థాపం చెంది ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది భార్య. ఈ ఘటన హైదరాబాద్లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.



 భూదేవి నగర్ లోని వెంకటాపురం లాస్ట్ బస్ స్టాప్ ప్రాంతంలో జమీర్ నాహిళ  భార్య భర్తలు  నివసిస్తున్నారు వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఇక ఇటీవల భార్య భర్తలు కరోనా వైరస్ బారిన పడడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఇటీవలే అర్ధరాత్రి రెండు గంటల సమయంలో భర్త మేలుకువ  వచ్చి చూడగా ఆ సమయంలో భార్య చాటింగ్ చేస్తూ కనిపించింది. రాత్రి సమయంలో మేలుకొని చాటింగ్ చేస్తే అనారోగ్యం కలుగుతుంది అంటూ భర్త భార్యకు సూచించాడు. భార్య చేతిలో నుంచి సెల్ ఫోన్ తీసుకొని బెడ్ రూం లోకి వెళ్ళిపోయాడు భర్త. దీంతో మనస్తాపానికి గురైన భార్య ఇంట్లో హాల్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక బెడ్రూంలో నిద్రపోయిన భర్త ఉదయాన్నే లేచి చూడగా భార్య ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో షాకయ్యాడు. ఇక భార్య మృతదేహాన్ని కిందికి దింపి పోలీసులకు సమాచారం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: