కరోనా  వైరస్ ప్రభావం విద్యా రంగం పై పడిన విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఎప్పుడో  ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం ఎంతో ఆలస్యం గా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అన్లాక్ మార్గదర్శకాల లో భాగంగా అన్ని రాష్ట్రాల కు విద్యాసంస్థల ను పునః  ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థను ప్రారంభించేందుకు తీవ్రస్థాయి లో కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అన్ని రకాల విద్యా కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల ను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.



 అంతే కాకుండా వివిధ కోర్సుల కు సంబంధించిన  ప్రవేశాల కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య విద్యార్థుల కు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు కఠిన నిబంధనల మధ్య విద్యా సంస్థలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది అంతేకాకుండా కరోనా వైరస్ కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది తెలంగాణ విద్యా శాఖ. ఇక ఇప్పటికే రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే.



 ఈ గడువు రేపటితో ముగియనుంది. ఈ క్రమంలోనే డిగ్రీ విద్యార్థులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇటీవలే దోస్త్ వెబ్ సైట్ సూచించింది. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో దోస్తు ద్వారా మూడో పేజ్ లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని.. ఆన్ లైన్ వెబ్ ఆప్షన్లు ఇవ్వని...  ప్రత్యేక ఫేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే విద్యార్థులు అందరూ  రేపటిలోగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటూ సూచించింది. ఇక సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 5లోగా కాలేజీలకు వెళ్లి రిపోర్టులు ఇవ్వాలి అంటూ దోస్త్ కన్వీనర్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: