ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రచ్చ జరుగుతుంది.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత బండి సంజయ్ పై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే.. అతన్ని అరెస్ట్ చేసిన సంగతి విధితమే.. అతని అరెస్ట్ పై నిరశిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు నిరసనలు చేస్తున్నారు. అంతేకాదు తెలంగాణ ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు భారీ సంఖ్యలో అక్కడ మోహరించారు. ఉదయం నుంచి అక్కడ వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది.



ఎంపీ నివాసంలో సంజయ్ ఒంటరిగా దీక్ష చేపట్టారు..అతనికి మద్దతు తెలుపుతూ చాలా మంది అక్కడ వస్తున్నారు. ఇకపోతే ఈ విషయం చాలా మంది రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సంజయ్‌ను అరెస్ట్ చేయడం పోలీసుల దుందుకుడు చర్య అన్నారు. పోలీసుల చర్యలు పలు సందేహాలకు తావిస్తోందని చెప్పారు. ఉద్రిక్తతలకు తావిచ్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు.  ఎన్నికల నిబంధనలను ప్రతి పార్టీకి ఒకేలా ఉండాలని సూచించారు. అలాగే అధికారం చేతి లో ఉందని మాత్రం ఇష్ట మొచ్చినట్లు చేయడం భావ్యం కాదని పవన్ చెప్పుకొచ్చారు..



రాష్ట్రంలోని పలువురు బీజేపీ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.. రఘునందన్ రావు ఇంట్లో జరిగిన సోదాల గురించి తెలుసుకున్న బండి సంజయ్ సిద్దిపేటకు బయలుదేరారు. అయితే సిద్దిపేటలో సంజయ్‌ని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ ఘర్షణ లో పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. కరీంనగర్ కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన గంట గంటకు ఉద్రిక్తంగా మారిపోతుంది. దాంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికి పోతుంది. తెలంగాణ సర్కార్ కు, బీజేపీ నేతలకు మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది.. మరి ఈ విషయం ఎంతవరకు వెళుతుందో , ఎన్ని నిరసనలు వెలువెత్తుతాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: