సిద్దిపేటలోని తన నివాసంలో మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. బిజెపికి దుబ్బాకలో డిపాజిట్ కూడా దక్కదని రోజుకో వేషం అని మండిపడ్డారు. రాష్ట్ర పథకాల్లో కేంద్రం నిధులంటూ గోబెల్స్ ప్రచారం.. టిఆర్ ఎస్ వాటిని తిప్పికొట్టంది అని అన్నారు. నిధుల్లో వాస్తవాలు ఉంటే రండి అంటే డిఫెన్స్ లో పడిపోయారని అన్నారు. కొద్ది రోజులుగా బిజెపి గ్రామ శాఖలు టిఆర్ ఎస్ లో విలీనం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కిరాయి నాయకులు, కార్యకర్తలతో నామినేషన్ వేశారు అని ఆయన ఆరోపించారు.

మా నాయకుల ఇళ్లపై రైడ్ చేస్తే సహకరించాము అన్నారు. రెండు చోట్ల టిఆర్ఎస్, రెండు చోట్ల బిజెపి నేతల ఇళ్లపై దాడులు చేసారని చెప్పారు. మాకొచ్చిన సమాచారం మేరకు వెళ్లి రైడ్ చేస్తే డబ్బులు దొరికాయని సిపి స్టేట్ మెంట్ ఇచ్చారు.. వీడియో ఫుటేజ్ ఉందని చెబుతున్నారని అన్నారు. పోలీసు అధికారులను డిమాండ్ చేస్తున్నాం.. ఆ వీడియో ఫుటేజ్ విడుదల చేయాలని ఆయన  డిమాండ్ చేసారు. లేదంటే బీజేపీ మరిన్ని గోబెల్స్ ప్రచారం చేస్తారు అని ఆయన విమర్శలు చేసారు. చెయ్యనిది చెసినట్లు చెప్పడం, జరగంది జరిగినట్లు చెప్పడం బీజేపీ కి అలవాటు అని విమర్శించారు.

స్పష్టంగా, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేసారు. బీజేపీ నాయకులు కార్యకర్తల్లో విశ్వాసం కోల్పోయారు అని అన్నారు. బీజేపీ సోషల్ మీడియా ద్వారా ఉదయం నుంచి ఎనిమిది చోట్ల రైడ్స్ అంటూ గత్తర గత్తర చేస్తున్నారు అని విమర్శలు చేసారు. పోలీసులే డబ్బులు పెట్టారంటూ దుష్ప్రచారం చేసారని, కేంద్ర హోం మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ల ట్రాప్ లో పడ్డారని ఆయన విమర్శించారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. డబ్బులతో పట్టుబడ్డ వ్యక్తే అవి బీజేపీ అభ్యర్థివని, ఎన్నికల ఖర్చు కోసం అంటూ చెప్పారని దీనికేం సమాధానం చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు రెచ్చగొట్టినా టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: