వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి అభ్యర్థుల పేరు, ప్రతిష్టలకన్నా ఎక్కువ జగన్ ఇమేజ్ తోడయ్యింది అన్న వాదన ను ఎవరు కాదనలేం. ఎందుకంటే జగన్ మొహం చూసే నియోజకవర్గంలో ఎవరో నిలబడ్డారో కూడా తెలీని ప్రజలు వైసీపీ కి ఓటువేశారు.. ఆ నమ్మకాన్ని వందకు వంద శాతం నిలబెడుతున్న జగన్ ఆ క్రెడిట్ తానొక్కడినే తీసుకోకుండా అభ్యర్థులందరికీ, కార్యకర్తలందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.. సంక్షేమ పథకాల్లో తానున్న లేకపోయినా అక్కడి ఎమ్మెల్యేలతో చేయిస్తూ ప్రజలకు మేలు జరగడమే లక్ష్యం గా ముందుకు సాగిపోతున్నారు..

 2019 ఎన్నికల వరకు టీడీపీ ఏం చెప్తే అది రాష్ట్రంలో ఫాలో అవుతుంది అనుకున్నారు టీడీపీ నేతలు.. ప్రభుత్వం తమదే అని ఇష్టం వచ్చినట్లు అవినీతికి పాల్పడ్డారు.. చంద్రబాబు కొంత హెచ్చరిస్తున్నా కూడా ముసలోడే కదా అని లైట్ తీసుకున్నారు. ఎన్నికలు అయ్యాక కన్నీ తెలీలేదు తాము ఏం కోల్పోయామో. చంద్రబాబు వయసుకు గౌరవమిచ్చి అయన అయన మాట వింటే ప్రజల్లో తమ పార్టీ నమ్మకం పోకుండా ఉండేదని భావిస్తున్నారు.. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్నట్లు ఇప్పుడు టీడీపీ నేతలు బాధపడ్డ వేస్టు..

ఇదిలా ఉంటే రెండున్నరేళ్లుగా ఎంతో సాఫీగా జరిగిన జగన్ పాలనా ఇప్పుడు గతి తప్పుతుందా అనే నుమానాలు వ్యక్తమవుతున్నాయి..  పార్టీ లో ఎవ‌రిని ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని చెబుతున్నారు.జ‌గ‌న్ విష‌యాన్ని తీసుకుంటే.. త‌న‌పై ఉన్న అక్ర‌మాస్తుల కేసుల విచార‌ణ ప్రారంభ‌మైంది. వీటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఆయ‌న త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో మునిగిపోయారు.దీంతో ఆయ‌న కింది స్థాయిలో ఏం జ‌రుగుతోందో.. తెలుసుకునే స‌మ‌యం లేకుండా పోయింద‌ని అంటు న్నారు. మంత్రులు కూడా  వారి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు ఉన్నార‌నే వ్యాఖ్య‌లు కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. కొంద‌రు మంత్రులు మాత్రం ముఖ్య‌మంత్రి క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం ఆయ‌న‌కు దూరంగా ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటున్నార‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: