ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కి ప్రజలు ఈ ఎన్నికల్లో అంత దారుణంగా ఓడించినా కూడా ఆయనకు కొంతైనా బాధ్యత లేకుండా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తుంది.. ప్రజల తీర్పును ఆయన గౌరవించకుండా అధికారంలోకి వచ్చిన జగన్ ను ఎప్పుడూ విమర్శిస్తూ ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందా అని ఎదురుచూస్తున్నాడు.. ఇప్పటికే పడిపోయిన పార్టీ ని చక్కదిద్దుకోవాల్సింది పోయి వయసు, అనుభవం, సీనియారిటీ అన్ని ఉంది కూడా ఇలా చేస్తుండడం ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదు..అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోవడం మానేసి , ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రజల కోసం ప్రజల పట్ల మొసలి కన్నీళ్లు కార్చడం ఒక్క టీడీపీ కే చెల్లింది..

ఒక్కరా ఇద్దరా... తెలుగు దేశంపార్టీ అధినేత తో సహా ప్రతి తెలుగు లీడర్ ప్రజలను పట్టించుకోకుండా తమ ఆస్తులను కూడబెట్టుకునేందుకు కష్టపడినవారే.. అలాంటి వారికి ఈ సారి దిమ్మ తిరిగిపోయేలా బుద్ధి చెప్పగా కొందరిని అయితే జాడ కూడా లేకుండా చేశారు ప్రజలు.. కొన్ని చోట్ల ప్రజలు టీడీపీ ని గుర్తుంచుకుని కాస్తో కూస్తో ఓట్లు పడినా చాలా చోట్ల టీడీపీ ని నామరూపాల్లేకుండా చేశారు.. దాన్ని సరిదిద్దుకోవడానికి టీడీపీ ఇప్పుడు చాలా కష్టాలు పడుతుంది.. పార్టీ లో చాలా మార్పు చేస్తూ బలపడేలా చేసుకుంటుంది..

ఇప్పటికే రాష్ట్రంలో పార్లమెంట్ నియోజక వర్గాల ఇంచార్జి లను నియమించింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చింది. అయితే ఈ మార్పుల్లో పదవులు పొందని వారు టీడీపీ పై కొత్త అసహనం గా ఉండడంతో వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.. అటు కమిటిలోను, ఇటు పాలిట్ బ్యూరోలోను చోటు దక్కని చాలామంది సీనియర్లు చంద్రబాబుపై అలిగారట. ఉన్న ముగ్గురు ఎంపిల్లో గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడుకు పదవులు ఇచ్చిన చంద్రబాబు విజయవాడ ఎంపి కేశినేని నానిని పక్కనపెట్టేశారు. అలాగే గుంటూరులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, నన్నపనేని రాజకుమారిలకు చోటు కల్పించలేదు. ఇక కృష్ణా జిల్లాలో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పంచుమర్తి అనూరాధ లాంటి సీనియర్లకు ఏ కమిటిలోను చోటు కనబడలేదు.ఇదే విషయమై అనేకమంది సీనియర్ నేతలు పార్టీ అధినేతపై అసంతృప్తితో మండిపోతున్నారట. అయితే ఈ విషయం గ్రహించిన చంద్రబాబు అసంతృప్తితో ఉన్న నేతలకు నేరుగా ఫోన్లు చేసి మరీ బుజ్జగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: