చంద్రబాబు అక్రమాలు, అవినీతి ని బయటకు తీస్తూ కూర్చుంటే ఓ మనిషి జన్మ చాలదు. ఎందుకంటే నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో అయన న్యాయం కంటే అన్యాయాలు, నీతి కంటే అవినీతి ని ఎక్కువ గా ప్రోత్సహించి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారు.. ప్రతి నియోజక వర్గంలో తన పార్టీ నేతలతో అవినీతి కి పాల్పడ్డాడు చంద్రబాబు.. అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కి తగిన శాస్తి జరిపారు.. కేవలం 23 సీట్లే వచ్చాయి అంటే టీడీపీ పార్టీ పరిస్థితి ప్రజల దృష్టిలో ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.. ఇక ఆయన చేతిలో ఎందరో సామాన్యులు అణగదొక్కబడ్డారు.

రాజకీయంగా ఎదిగి తనకు పోటీ వస్తారు అన్న ఆలోచన వచ్చినా ఆ లీడర్ ని ఎదగనివ్వలేదు..  పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే చంద్రబాబు తన కుటిల రాజకీయ తంత్రం తో ఎదురు మనిషి ని ఎలా లోబరుచుకోవాలో లోబరుచుకుని వాడుకుని ఆ తర్వాత వారి ని తన స్టయిల్ లో మోసం చేస్తారు.. ఇక ఈ పద్ధతి కేవలం మానవుల వరకే కాదు ఆ జగన్నాధుడు పై కూడా.. చంద్రబాబు కు మానవుడైన, దేవుడైనా ఒకటే.. తన  కాదేదీ అవినీతికనర్హం అన్నట్లు చంద్రబాబు అవినీతికి హద్దులేదు..ఇక సొంత నేతలను కూడా చంద్రబాబు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుని యా తర్వాత వారికి తన మొహం చాటేస్తున్నాడు..  ఈ విషయం జేసీ, భుమా కుటుంబాల విషయంలో స్పష్టంగా తెలుస్తుంది.

టీడీపీలో ఈ మ‌ధ్య కాలంలో ప‌లు  నియామ‌కాలు సాగాయి. వాటిల్లో ముందు జ‌రిగిన‌వి పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం బాధ్యుల నియామ‌కాలు. ఎన్నిక‌లైపోయిన ఏడాదికి చంద్ర‌బాబు నాయుడు ఆ నియామ‌కాల‌ను చేప‌ట్టారు. వాటిల్లో జేసీ కుటుంబానికి అధికారికారాల క‌త్తెర ప‌డింది.చంద్ర‌బాబు మ‌ళ్లీ వ‌స్తాడంటూ ఆయ‌న ప‌గ‌టి క‌ల‌ల‌ను ఓపెన్ గా చెప్పుకు తిరుగుతున్నారు. చంద్ర‌బాబు మీద జేసీకి ఉన్న పాటి విశ్వాసం, జేసీ పై చంద్ర‌బాబుకు లేన‌ట్టుగా ఉంది. ఇక ప‌ద‌వుల జాబితాలో వినిపించ‌ని పేరు భూమా కుటుంబానిది. నంద్యాల లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం బాధ్యుల నియామ‌కంలో కానీ, పార్టీ క‌మిటీల నియామ‌కాల్లో కానీ భూమా కుటుంబానికి ప్రాధాన్య‌త ద‌క్క‌లేదు. అఖిల‌ప్రియ‌, ఆమె సోద‌రుడు చంద్ర‌బాబుకు వీర విధేయ‌త వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: