తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చూపిస్తున్న దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి అధికార ప్రభుత్వాలకి కొంత తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది.. మోడీ సౌత్ పై ద్రుష్టి పెట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ఇక్కడి నేతలకు చెప్పగా రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఆ విధంగా ముందుకు సాగుతున్నారు.. రెండు రాష్ట్రాల్లో మంచి పోటీ బీజేపీ ఇవ్వనుందని తెలుస్తుంది.. ఇప్పటికే పంటికింద రాయిలా అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తలనొప్పిని తెస్తుండగా తెలంగాణాలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ ప్లేస్ కి ఎసరు పెట్టింది.

ఈ ఉత్సాహంతో ఏపీ లో  స్ట్రీమ్ లైన్ లో ఉన్నట్లు బీజేపీ చెప్పకనే చెప్పింది.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరో గేర్ వేసి అధికార ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నట్లు అయన చేపడుతున్న కార్యక్రమాల ద్వారా అర్థమవుతుంది.  వీర్రాజు రాష్ట్రంలో జరిగే ప్రతి చిన్న విషయానికి స్పందించి బీజేపీ ని ప్రజల నోళ్ళలో నాన్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. దేవాలయాల దాడుల విషయంలో బీజేపీ టీడీపీ కన్నా ఎక్కువ ఆందోళనలు చేస్తుంది.. అయితే కడుపు కాలి జనం ఇబ్బందులు పడుతున్న ఈ కరోనా వేళ  మతం పేరు చెప్పి రెచ్చగొట్టుడు రాజకీయం చేయడంలో ఎలాంటి అర్థం ఉందొ కమలనాధులకే తెలియాలి అని కొందరు రాజకీయ విశ్లేషకులు అన్నారు.  

ఇది లా ఉంటే బీజేపీ పేరుకే బలపడుతుందని, ప్రజల్లో పార్టీ కి పెద్దగా పేరు లేదు అన్నది కొంతంనుండి వైసీపీ నేతల అభిప్రాయం.. రెండు రాష్ట్రాల్లో బీజేపీ కి కేవలం కేంద్రంలో అధికారంలో ఉందని సానుభూతి మాత్రమే ఉందని చెప్తున్నారు.. బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన సైలెంటయిపోయింది. ఆ పార్టీని నియంత్రిస్తూ.. వైసీపీకి మరింత మేలు చేస్తున్నారు కానీ.. బీజేపీ నేతలు.. సొంతంగా ఎదిగే ప్రయత్నమే చేయడం లేదు. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. కన్నా లక్ష్మినారాయణ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు.. ప్రభుత్వంపై విరుచుకుపడుతూ… ఉండేవారు. దాని వల్ల బీజేపీ ఎప్పుడూ మీడియాలో పోరాడుతున్నట్లుగా ఉండేది. కానీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు వచ్చాక.. వైసీపీకి అనుబంధ సంస్థగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆశలు పెట్టుకోవడంలో తప్పు లేదు.. కానీ సాధించాలంటే… ఎంతో కష్టపడాలి.. ఆ నైజం ఏపీ బీజేపీ నేతల్లో కనిపించడం లేదనేది.. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: