జగన్ గెలుపు రాష్ట్రంలో ఒక విప్లమని చెప్పాలి.. ఎందుకంటే గెలుస్తుందా గెలవాడా అన్న స్థాయి నుంచి బంపర్ మెజారిటీ తో గెలిచే స్థాయికి వచ్చిన వైసీపీ పార్టీ గెలుపు నిజంగా ఓ విప్లవమని చెప్పాలి..అప్పటికే టీడీపీ బకాసురులు ప్రజలనుంచి దోచుకుని ప్రజలను అణిచివేసే స్థాయికి వచ్చారు.. దాంతో ప్రజలు టీడీపీ ని అధికారంలోకి రానివ్వొద్దని డిసైడ్ అయ్యారు.. దాంతో ప్రత్యామ్నాయంగా కనిపించిన జగన్ ని గెలిపించి ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు..  అయన గెలుపు తో రాజకీయాల్లో ఓ సంచలనం మొదలవగా చంద్రబాబు వంటి నేతలు ఇప్పటికే జగన్ పై గెలవడానికి ప్రయత్నిస్తున్న జగన్ మాత్రం అలాంటి నాయకులకు అందకుండా రోజు రోజు కు ప్రజల దృష్టిలో దేవుడిలా ఎదుగుతున్నాడు..

 ఇక అధికారంలోకి రాగానే అధికారం అంటే ఇది అని చెప్పే విధంగా అయన పరిపాలన కొనసాగిస్తున్నారు.. జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 17 నెలలు పూర్తయ్యింది. అంటే ఏడాదిలో రెండున్నరేళ్లు పూర్తవుతాయన్నమాట..ఈ క్రమంలో జగన్ మొదట్లో చెప్పిన  ప్రతి మాటకు నిలబడి ఉంటున్నారు.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు ఏ లోటు రాకుండా చుస్తునారు.. ఇక టీడీపీ విషయానికొస్తే టీడీపీ పార్టీ తమ ఓటమి కి కారణాలు ఇంటిని వెతుకులాట కొనసాగిస్తోంది..

వారి ఓటమికి ముఖ్య కారణం బీసీ వర్గాన్ని, తమకు అండగా ఉన్న ఇతర సామజిక వర్గాలను పట్టించుకోకపోవడమే అని టీడీపీ కి అర్థమైపోయింది.. అధికారంలో ఉండగా అండగా ఉన్నవారిని ఏ మాత్రం పట్టించుకోకుండా, ఆ అధికారం పోయాక ‘నేను మారాను’ మిమ్మల్ని ఏదో చేసేస్తాను అని చెప్పే విషయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడికి ఒక ప్రత్యేక రికార్డే ఉందని చెబుతుంటారు ఆయన సొంత పార్టీ నాయకులు. ఆ విధంగానే చంద్రబాబు అధికారంలోకి రాగానే టీడీపీ కి సపోర్ట్ గా ఉన్న సామజిక వర్గాలను పట్టించుకోలేదు.. దాంతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు..  ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు వెనుకబడిన సామాజికవర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించకపోవడం తాము చేసిన అనేక పొరపాట్లలో ప్రాధాన్యమైనదిగానే టీడీపీ నేతలు ఇప్పుడు గుర్తిస్తున్నారంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: