తెలంగాణలో బలపడటం అనేది అంత ఈజీ కాదు. దీనితో భారతీయ జనతా పార్టీ చాలా వరకు కూడా కష్టపడుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అదే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పడు తెలంగాణా మీద ఎక్కువ ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. అటు బెంగాల్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ కాస్త పట్టుదలగా వ్యవహరిస్తుంది. బీజేపీ నేతలు ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో కాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టారు.

ఈ రెండు రాష్ట్రాల్లో కూడా తీవ్ర స్థాయిలో అధికార పార్టీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న సంగతి అర్థమవుతుంది. దీనితో సీఎంలు కూడా ఇప్పుడే కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నట్టు గా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ విషయంలో గవర్నర్ల పాత్ర కూడా కాస్త ఆసక్తికరంగా మారింది. అటు బెంగాల్లో గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కూడా దాదాపు అదే జరగవచ్చు అని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.

దీంతో ఇప్పుడు గవర్నర్ ని ఎదుర్కోవడం టిఆర్ఎస్ పార్టీకి కాస్త కష్టంగానే ఉండే అవకాశాలు ఉండవచ్చు అని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే రాజకీయంగా మాత్రం ఇప్పుడు బెంగాల్లో జరిగిన విధంగానే  తెలంగాణలో జరిగే అవకాశాలు ఉండవచ్చు. శాంతిభద్రతల సమస్యలను బిజెపి సృష్టిస్తుందని అక్కడ తృణముల్ కాంగ్రెస్  నుంచి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఏ విధంగా రాజకీయం ఉంటుందో చూడాలి. ఇక బెంగాల్ లో వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టింది. 22 లో తెలంగాణా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: