ఇప్పుడు తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలు ఏ రేంజ్ లో  హీట్ ని పెంచుతున్నాయో అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయం మాత్రం కాస్త ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పట్టుదలగా ఉంటే బిజెపి మాత్రం కాస్త గట్టిగానే రాజకీయం చేస్తుంది.  ప్రధానంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీని చాలావరకు ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని ముందు నుంచి కూడా బండి సంజయ్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన విషయంలో కూడా ఆయన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. దీనితో రాష్ట్రంలో రాజకీయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. బీజేపీని ఎదుర్కోవడానికి టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో బండి సంజయ్ కి చాలా మంచి ఇమేజ్ వచ్చిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆయన ప్రజల్లోకి ముందు నుంచి కూడా చాలా బలంగా వెళ్తుంటారు. ఇక తాజాగా రఘునందన్ రావు కి అండగా నిలవడంతో బిజెపి కార్యకర్తలలో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. టిఆర్ఎస్ పార్టీని విమర్శించే విషయంలో దూకుడుగా ఉండే బండి సంజయ్ ఇప్పుడు ఏకంగా దీక్షకు కూర్చున్నారు. దీనితో బిజెపి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఆరేళ్ల నుంచి టిఆర్ఎస్ పార్టీ ని ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ తరుణంలో బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు అని రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: