దుబ్బాకలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్  విషయంలో తెలంగాణా పోలీసులు అనుసరించిన తీరుపై ఇప్పుడు విపక్షాలు మండిపడుతున్నాయి. బండి సంజయ్ మీద పోలీసులు దాడి చేసారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ కి తన వరకు వస్తే గాని తత్వం బోధపడలేదు అని  రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ బుట్టలో పాములాంటిది అని ఆయన ఆరోపించారు. టిఆర్ఎస్ తన బుట్టలోనిదే అని బీజేపీ ఇన్నిరోజులు భావించింది అని ఆయన అన్నారు.

ఒక పార్టీ అధ్యక్షుడిని గొంతు పిసికి చంపే ప్రయత్నం చేశారు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీలో కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గం ఉంది అని ఆయన అన్నారు. బండి సంజయ్ ను పరామర్శించడానికి మురళీధర్ రావు, విద్యాసాగర్ రావు  ఎందుకు వెళ్ళలేదు అని ఆయన ప్రశ్నించారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను పిలిచి రివ్యూ పెట్టే అధికారం ఉన్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు చేయలేదు అని ఆయన నిలదీశారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి విచారణకు ఎందుకు అదేశించలేదు అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

టిఆర్ఎస్ తో కిషన్ రెడ్డి కి ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. డబ్బులు ఉంటే సోదాలు చేయాల్సింది ఐటి డిపార్ట్ మెంట్ అని ఆయన అన్నారు. పోలీస్ లకు సోదాలు చేసే అధికారం ఎక్కడిది అని ఆయన ప్రశ్నించారు. రఘురామ రాజుకు సెక్యురిటి ఇచ్చిన కేంద్రం తమ సొంత ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎందుకు ఇవ్వలేదు అని ఆయన నిలదీశారు. బండి సంజయ్ ని మొదటిసారి కొట్టినప్పుడు పోలీస్ ల మీద చర్యలు తీసుకోలేదు కాబట్టే ఇప్పుడు మళ్ళీ చంపే ప్రయత్నం చేశారు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: