సిద్దిపేట జిల్లా... దుబ్బాక నియోజకవర్గ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఎన్నికలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో అర్ధం కావడం లేదు. అధికార పార్టీ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విపక్షాలు మండిపడుతున్నాయి. నిన్న జరిగిన కొన్ని ఘటనలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయిన బీజేపీ నాయకులను పరామర్శించడానికి వచ్చిన బీజేపీ నాయకులు వివేక్, జితేందర్ రెడ్డి... రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

రాత్రి బీజేపీ కార్యకర్తలను పట్టుకొచ్చరని వారిని పరామర్శ కోసం వచ్చాం అని ఆయన పేర్కొన్నారు. పోలీసులు ఘటనా జరిగిన ప్రదేశం లో లేనివారిని పట్టుకొచ్చారు అని ఆయన విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు డబ్బులు ఎత్తుకెళ్ళలేదు, అవి పోలీస్ వాళ్ళు తెచ్చారని చూపించారు అని ఆయన పేర్కొన్నారు. పోలీస్ లు కొంతమంది బీజేపీ కార్యకర్తలను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు దైర్యంగా ఉండి, రఘు నందన్ రావు గెలుపు కోసం కృషి చేయాలి అని ఆయన సూచించారు.

హరీష్ రావు కి ఒడిపోతున్న అని తెలిసి ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు అని అన్నారు. హరీష్ రావు ఆటలు సాగనియం అని ఆయన స్పష్టం చేసారు. వివేక్ మాట్లాడుతూ... పోలీసులను కెసిఆర్, హరీష్ రావు లు అన్ని రకాలుగా వాడుకుంటున్నారు అని ఆయన ఆరోపించారు. ఘటన ప్రదేశంలోని వీడియోలు చూస్తే పోలీస్ లే డబ్బులు తెచ్చినట్టు ఉన్నాయి అని ఆయన వివరించారు. కెసిఆర్ అనేక రకాలుగా కుట్ర పన్నుతున్నాడు అని ఆయన మండిపడ్డారు. బీజేపీ గెలుపు కెసిఆర్ కి చెంప పెట్టు కావాలి అని ఆయన అన్నారు. కాగా బండి సంజయ్ నిరసన దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: