అనురాగ్ యూనివర్సిటీలో ధరణి పోర్టల్ పై తాహిసిల్దార్, నయాబ్ తహసీల్దార్ ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాహుల్ బొజ్జా, సునీల్ శర్మ, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ పై తహసిల్దార్, నయాబ్ తహసీల్దార్ లకు ట్రైనింగ్ ఇచ్చాము అని వారు పేర్కొన్నారు. తహసీల్దార్ సెలవులో ఉంటే నయాబ్ తహసీల్దార్ పని చేయాలి అని అన్నారు. ప్రతి తహసీల్దార్ వారి మండలం లో పది నుండి ఇరవై  కేసుల వరకు ట్రైనింగ్ రూపంలో చేశారు అని తెలిపారు.

ఈ ప్రక్రియ చాలా విజయవంతంగా జరిగింది, ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగింది అని అన్నారు. సియం గారి విజన్ ప్రకారం చాలా సింపుల్ గా, పారదర్శకంగా పని జరిగేలా రూపొందించాము అని వివరించారు. బయోమెట్రిక్ అటెన్టికేషన్ తర్వాతే సేల్ జరుగుతుంది అని అన్నారు. ఎవరి పేరు మీద భూమి ఉంటుందో వారి ఆధార్ నంబర్ ఇక్కడ ఉంటుంది, మోసం చేయడానికి లేదు అని స్పష్టం చేసారు. ప్రభుత్వ భూమి, సాగునీటికి, వక్ఫ్, దేవాలయ భూములను ఆటో లాక్ లో పెట్టాము అని అన్నారు.  ఎవరు వాటిని ముట్టుకోలేరు అని స్పష్టం చేసారు.

మ్యుటేషన్ కోసం తిరిగి తిరిగి అలసిపోయే వారు అని... ఇప్పుడు అలాంటిది జరుగదు అని అన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వెంటనే అవుతుంది అని పేర్కొన్నారు. సియం కేసీఆర్ గారు 29వ తేదీ మధ్యాహ్నం  ధరణి పోర్టల్  ప్రారంభిస్తారు అని తెలిపారు. ప్రపంచంలోనే ఇంత ఈజీ గా జరిగేది ఎక్కడా లేదు అని పేర్కొన్నారు. ఇది సూపర్ హిట్ అవుతుంది అని ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు. కాగా ధరణి పోర్టల్ ని ఎల్లుండి మధ్యాహ్నం సిఎం కేసీఆర్ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: