ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చాలా వరకు కూడా రాష్ట్రానికి నిధులు ఇచ్చే విషయంలో బిజెపి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం. ముందు ఒక ఏడాది నిధులను ఎక్కువగానే ఇచ్చిన బిజెపి ఆ తర్వాత మాత్రం చాలా వరకు కూడా నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం నుంచి అనేక ఇబ్బందులు పెట్టింది. ఇక ఈ సమయంలో వైసీపీ నేతలు విపక్షంలో ఉండి కొన్ని వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తూ ఉండేవారు. బిజెపి కూడా చాలా వ్యాఖ్యలు చేసేది.

చంద్రబాబు అవినీతి కారణంగా రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, యూసీ లు ఇవ్వడం లేదని, అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం అవినీతి చేయడం, వాటి ఆధారాలు కేంద్రం వద్ద ఉండటం, డబ్బులను దుర్వినియోగం చేయడంతో నిధులు ఇవ్వడానికి కేంద్రం ఆసక్తి చూపించడం లేదని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది వైసీపీ. కేంద్రం పాత బకాయిలు కొన్ని ఇచ్చింది. కాని ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మాత్రం ఏకంగా దాదాపుగా 40 వేల కోట్లకు సున్నం పెట్టింది. 22 వేల కోట్లకే ఇస్తామని చెప్పింది.

జాతీయ ప్రాజెక్ట్ అయినా సరే పునరావాసానికి తమకు ఏ విధంగా సంబంధం లేదని స్పష్టం చేసింది. కేవలం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం మాత్రమే తాము చెల్లిస్తామని చెప్పింది. అంటే వైసీపీ సర్కార్ వృధా చేస్తుంది కాబట్టే కదా నిధులు ఇవ్వడం లేదు కేంద్రం...? వైసీపీ సర్కార్ మీద నమ్మకం లేకనే కదా...? డబ్బులు సంక్షేమ కార్యక్రమాలకు మళ్ళిస్తారు అనే కారణంతోనే కదా ఇవ్వడం లేదు...? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మీడియా ముందు అప్పుడు  హడావుడి చేసిన జీవీఎల్ సహా చాలా మంది నేతలు ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడటం లేదు. ఇంకో విషయం ఏంటీ అంటే అప్పట్లో జగన్... ప్రధానిని కలిసిన తర్వాత 55 వేల కోట్లకు కేంద్రం అంగీకారం తెలిపింది అని విజయసాయి రెడ్డి  కూడా వ్యాఖ్యలు  చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: