గత కొంతకాలంగా రాజకీయాలలో సైలెంట్ గా ఉంటున్న... కాంగ్రెస్ నేత సినీ నటి విజయశాంతి ఏ పార్టీలోకి వెళతారు ఏంటీ అనే దానిపై చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. ఆమె గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చాలా సైలెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా కూడా పెద్దగా ఆమె ఎక్కడా స్పందించే పరిస్థితి లేదు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే బిజెపి బలపడాలి అని భావిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బలపడాలి అని భావించిన సరే ఆ పార్టీకి అనుకున్న విధంగా పరిస్థితి కనబడటం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు బయటకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ నేతలతో  ఆమె చర్చలు జరిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో విజయశాంతి భేటీ అయ్యారు. గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్న ఆమె... పెద్దగా రాజకీయాల్లో ఎవరిని కూడా విమర్శించే సాహసం చేయడం లేదు.

దీనితో ఇక ఆమె రాజకీయ భవిష్యత్తుపై చాలా అనుమానాలు వచ్చాయి. అయితే ఆమెకు వెళ్తే ఏ పదవి ఇస్తారు ఏంటి అనే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉండవచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి బీజేపీ నేతలు ఆమెను ఆహ్వానిస్తూ వస్తున్న సరే ఆ మాత్రం చాలా వరకు సైలెంట్ గా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపధ్యంలో బీజేపీ తనకు సరైన పార్టీ అని భావించిన ఆమె... ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: