బీజేపీ మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రఘునందన్ ను గెలిపించడానికే గొల్ల కుర్మలు తరలి వచ్చారు   అని ఆమె అన్నారు.  ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ గొల్ల కుర్మలకు ఇచ్చిన మాట విస్మరించారు అని అన్నారు. టీఆర్ఎస్ కు ఓటేస్తేనే గొర్లు ఇస్తామని గద్దెనెక్కిన తరువాత మోసగించారు  అని ఆమె మండిపడ్డారు. గొర్లన్నీ కేసీఆర్ ఫాంహౌజ్ కు తరలించారా అని ప్రశ్నించారు. గొల్ల కుర్మల పిల్లలకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, పెన్షన్లు వచ్చాయా అని ఆమె నిలదీశారు.  

గజ్వేల్, సిద్ధిపేట మాదిరిగా రోడ్లు వేశారా అని ప్రశ్నించారు. దుబ్బాక ఏం పాపం చేసింది...? ఎందుకు ఇక్కడ గుంతల రోడ్లున్నాయి అని ఆమె ప్రశ్నించారు. రామలింగరెడ్డి దుబ్బాకను ఎందుకు డెవలప్ చేయలేదు అని నిలదీశారు. పక్క నియోజకవర్గంలోనే ఆర్థిక మంత్రి హరీష్ రావు ఉండి దుబ్బాకను ఎందుకు డెవలప్ చేయలేదు అని విమర్శించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలే తెలంగాణ ఉద్యమ నినాదం అని ఆమె అన్నారు. మరి తెలంగాణ వచ్చాక అవి ఎందుకు నెరవేరలేదు అని ప్రశ్నించారు.

అమాయకులు పెట్రోల్ పోసుకుని తెలంగాణ ఉద్యమంలో చనిఫోయేలా కేసీఆర్, హరీష్ రావులు రెచ్చగొట్టారు అని విమర్శించారు. ఆ పాపం ఊరికే పోదు అన్నారు. హరీష్ కేమో పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్టె దొరకలేదట అని ఆమె ఎద్దేవా చేసారు. డబ్బులు ఎవరి దగ్గరున్నవి.. టీఆర్ఎస్ వాళ్ల దగ్గర అన్నారు. రఘునందన్ రావు డబ్బులు పంచుతున్నారని నిన్న అంతలా రెచ్చిపోతారా అని నిలదీసారు. దుబ్బాక తీర్పు కేసీఆర్ అహంకారాన్ని దించుతుందన్నారు. దుబ్బాక ప్రజలు బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలి  అని ఆమె కోరారు. రఘునందన్ రావు రేపు అసెంబ్లీలో అడుగుపెడతారనే కుట్రతోనే పోలీసుల చేత దాడులు  చేయిస్తున్నారన్నారు. దుబ్బాకలో లక్ష మెజారిటీతో గెలుస్తామని కేసీఆర్ చెబుతుంటే హరీష్ రావు ఎందుకిలా వ్యవహరిస్తున్నారు అని ఆమె ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: