దుబ్బాక ఉప ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అధికార పార్టీ నేతలపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి బాబూ మోహన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రఘునందన్ రావు ఉద్యమ వీరుడు అని అన్నారు. ఉద్యమంలో కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్నాడు అని ఆయన తెలిపారు. ఉద్యమం ముగియగానే రఘునందన్ రావు ఎక్కడ మేకు అవుతారోనని కేసీఆర్ పక్కనబెట్టారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పిన కథలన్నింటినీ టీవీ చర్చల్లో రఘునందన్ రావు బయట పెట్టారు అని ఆయన విమర్శించారు.

రఘునందన్ రావును ఓడగొట్టడానికి మంత్రి హరీష్ రావు పోలీసులను బాగా వాడుకుంటున్నారు  అని మండిపడ్డారు. రఘునందన్ ను ఎందుకు ఓడగొట్టాలి అని ఆయన ప్రశ్నించారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల రైతులను మోసగించిన టీఆర్ఎస్ కు ఓటేస్తారా  లేక రఘునందన్ రావుకు ఓటు వేస్తారో ఆలోచించాలి అని ఆయన సూచించారు. ఎన్నికల్లో గెలవడానికి రఘునందన్ రావును పోలీసులతో కొట్టిస్తారా అని మండిపడ్డారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలిస్తే ఏమీ రాదు  అని ఆయన స్పష్టం చేసారు.

రఘును గెలిపిస్తే  దుబ్బాక అభివృద్ధి అవుతుంది  అని ఆయన తెలిపారు. అదే విధంగా... కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుంటే రాష్ట్రంలో ఏ స్కీము నడవదు అని ఆయన స్పష్టం చేసారు. ఖబడ్దార్ కేసీఆర్.. ఎన్నికలను ఎన్నికలాగా చూడండి అని ఆయన సవాల్ చేసారు. బీజేపీ గెలిస్తే పెన్షన్లు రావని ప్రచారం చేస్తారా అని మండిపడ్డారు. ఒక మంత్రి చేసే పనులేనా ఇవి అని ఆయన నిలదీశారు. ప్రధాని  నరేంద్ర మోదీ  , హోం మంత్రి అమిత్ షా సమయం కోసం చూస్తున్నారు అని ఆయన హెచ్చరించారు. సమయం వస్తే టీఆర్ఎస్ కు మాములుగా ఉండదు అన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలిపిస్తే కేసీఆర్ దగ్గర హరీష్ రావుకు పరపతి ఉండదని ఆయన ఎద్దేవా చేసారు .

మరింత సమాచారం తెలుసుకోండి: