టిడిపి సీనియర్ నాయకులతో ఆ  పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 175నియోజకవర్గాల టిడిపి ఇన్ ఛార్జ్ లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.  వైసిపి అధికారంలోకి వచ్చాక  ఒక్కో రైతుకు రూ రూ 77,500 ఎగ్గొట్టారు అని ఆయన మండిపడ్డారు. ‘‘రైతు భరోసా’’ పేరుతో 5 ఏళ్లలో ఒక్కో రైతుకు వైసిపి ప్రభుత్వం ఇచ్చేది రూ37,500 మాత్రమే అని ఆయన అన్నారు.  అదే టిడిపి ప్రభుత్వం వచ్చివుంటే అన్నదాత సుఖీభవ, రుణమాఫీ 4, 5 కిస్తీల కింద, ఒక్కో రైతుకు రూ లక్షా 15 వేలు వచ్చేది అని అన్నారు.

ఒక్కో రైతుకు రూ 77వేల పైగా ఎగ్గొట్టి మీడియాలో గొప్పగా యాడ్స్ ఇవ్వడం వైసిపి నమ్మక ద్రోహం కాదన్నారు. ఎన్నికలకు ముందు విపత్తు సహాయ నిధి రూ 4వేలకోట్లు ఇస్తామని రైతులను నమ్మించారని ఆయన తెలిపారు.  అధికారంలోకి వచ్చాక మాట తప్పారు, మడమ తిప్పారన్నారు. ఇప్పుడు రూ 500 ఇస్తామని, వారం రోజులు నీళ్లలో ఇళ్లు మునిగితేనే రేషన్ ఇస్తామంటూ వరద బాధితులతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. సుఫ్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అన్నదాతకు బేడీలా? అని ఆయన నిలదీశారు.

అసలే అక్రమ కేసులు. ఆపై మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి మానవ హక్కుల ఉల్లంఘనకు బాధ్యత వహించాలి అని ఆయన స్పష్టం చేసారు. కృష్ణాయపాళెం దళిత, బిసి, తదితర రైతులపై ఎస్సీ అట్రాసిటి కేసు పెట్టడం సరైంది కాదని ఫిర్యాదుదారుడైన ఈపూరు రవి పోలీసులను కోరారు అని,  తాను పెట్టిన కేసును కూడా ఉపసంహరించుకోమని పోలీసులకు విజ్ఞప్తి  చేశారన్నారు. అయినా పోలీసులు తమ అక్రమ కేసులను సరిచేసుకోకపోగా అన్నదాతలకు సంకెళ్లు వేయడం తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అవుతుందన్నారు.  రైతు విద్రోహ చర్య అవుతుందని ఆయన పేర్కొన్నారు. మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా రైతులకు బేడీలు వేయకూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించే విధంగా పోలీసు చర్య ఉన్నదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: