నువ్వు నన్ను నాశనం చేయాలి అనుకుంటే నేను నిన్ను బతకనిస్తానా అనే  విధంగానే ప్రస్తుతం భారత్ చైనా భారత్ సరిహద్దుల్లో  వ్యూహాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. చైనా కన్నెర్ర చేసి చూస్తే భయ పడడం కాదు ఏకంగా ఆ కన్నె పొడిచేస్తా   అన్న విదంగా  ముందుకు సాగుతుంది భారత్. భారత్-చైనా సరిహద్దుల్లో  తలెత్తిన వివాదాల నేపథ్యం లో ఇప్పటికే భారత్ ఎంతో  వ్యూహాత్మకం గా ముందుకు వెళ్తున్న  విషయం తెలిసిందే. వరుసగా చైనా కు షాకులు ఇస్తూనే ఉంది భారత్.



 చైనాతో తలెత్తిన వివాదం నేపథ్యం లో తమకు అనుకూలంగా మార్చుకున్న భారత ఇప్పటికే ప్రపంచ దేశాల తో దౌత్య పరమైన సంబంధాల ను మెరుగు పరుచుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ అగ్రరాజ్యాలు  సైతం భారతదేశంతో నడిచేందుకు సిద్ధంగా ఉండగా ఇప్పుడు చిన్న చిన్న దేశాలతో కూడా సత్సంబంధాలను కొనసాగిస్తుంది భారత్. ఎలాగైతే పాకిస్తాన్ నేపాల్ దేశాలను  తమ ఆధీనంలోకి తెచ్చుకుని చైనా భారత్ చుట్టూ  వలపన్నెందుకు ప్లాన్ చేసిందో... అదే విధంగా ప్రస్తుతం భారత్ కూడా ప్లాన్  చేసింది.



 ఇటీవలే తైవాన్ తో వాణిజ్యపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న భారత్... ఇప్పుడు చైనా శత్రు దేశమైనా మరో దేశంతో దౌత్య  పరమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. దక్షిణ చైనా సముద్ర దేశం అయినటువంటి ఫిలిపైన్స్ దేశం చైనాకి బద్ద శత్రువు  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ ఫిలిఫైన్స్ తో ఉన్నత స్థాయి దౌత్య సంబంధాలను ప్రారంభించింది. ఫిలిప్పైన్స్ లో  పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి భారth సిద్ధమైంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య మొదటి విడత చర్చలు ఎంతో విజయవంతంగా పూర్తయ్యాయి. రానున్న రోజుల్లో భారీ ఒప్పందాలు జరిగనున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుసగా భారత్  చైనా చుట్టూ వలపన్నుతుంది  అని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: