రోజు రోజుకు ఆధునిక టెక్నాలజీ పెరిగిపోతుంది.. ఒకప్పటిలా కాకుండా ప్రస్తుతం మనిషి టెక్నాలజీ వెనుక పరుగులు పెడుతున్నాడు. దీంతో రోబో లాగా మారి పోతున్న మనిషి సాధారణ జీవనశైలి మరిచి  బంధాలను బంధుత్వాల ను మరిచిపోతున్నాడు. ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకోవడానికి ఎవరూ కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు. కెరియర్ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని అందరూ సైలెంట్ గా ఉండి పోతున్నారు. ఇక కెరీర్ సెటిల్ అయ్యే సరికి వయసు మీద పడి పోతూ ఉండడం తో అప్పుడు పెళ్లి చేసుకున్న పెద్దగా ఉపయోగం ఉండటం లేదు.



 మరోవైపు కుటుంబ బాధ్యతల కు  భయపడి కూడా ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. మన దేశం లో ప్రస్తుతం జనాభా సంఖ్య ఒక మోతాదులో ఉన్నప్పటికీ కొన్ని కొన్ని దేశాలలో మాత్రం జనణాల సంఖ్య గణనీయంగా తగ్గి పోయింది. దీంతో అక్కడి ప్రభుత్వాలు ఆయా దేశాల లో  జననాల సంఖ్య భారీగా పెంచేందుకు తీవ్రస్థాయి లో కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఎలాగైతే పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు తీసుకొస్తాయో.. ప్రస్తుతం యూరోపియన్ దేశాలలో పిల్లలను కనడానికి తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాయి  ప్రభుత్వం.



 జననాలను పెంచడం కోసం ఒక్కొక్క దేశం ఒక్కోలాగా ప్రయత్నాలు చేస్తుంది. ఫిన్లాండ్ దేశం గ్రామంలో భారీగా జనం తగ్గిపోవడంతో.. రానున్న  రోజుల్లో వృద్ధులు మాత్రమే ఆ గ్రామంలో మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది అని భావించిన ప్రభుత్వం ఏకంగా అక్కడ గ్రామంలో పిల్లలను కనడానికి తల్లిదండ్రులకు ప్రోత్సాహం అందించేందుకు సరికొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. పిల్లలను కన్న వారికి ఏడు లక్షల వరకు ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం . జననాలను పెంచడానికి యురోపియన్ దేశాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ఉండడం ఆసక్తికరంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: