భారత దేశంలో కరోనా ప్రభావం మిగిలిన దేశాల తో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంది. మొదట్లో ఊపందుకున్న ఈ కరోనా వల్ల చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికీ ప్రాణాలను కోల్పోతున్నారు. మరి కొంతమంది చికిత్సను పొందుతున్నారు. కాగా గత రెండు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం పూర్తిగా క్షీణించింది. మరణాల రేటు కూడా ఓ మాదిరిగా తగ్గింది.. ఇక రాష్ట్రాల్లో కరోనా ను జయించిన వారి సంఖ్య పెరిగింది. దీంతో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిందని అధికారులు అంచనా వేస్తున్నారు..



తాజాగా అధికారులు మరొక బాంబ్ లాంటి వార్తను పేల్చారు. రానున్న రోజుల్లో కరోనా ప్రభావం పెరుగుతుందనే అంచనా వేస్తున్నారు. చలికాలం కాబట్టి కరోనా ఉగ్ర రూపాన్ని దాల్చుతుంది. చలి తీవ్రత రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండటంతో వైరస్  మళ్లీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.రాష్ట్రంలో కరోనా రెండోసారి విరుచుకుపడే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. చలి కాలం ప్రారంభం కావడం తో ఫ్లూ వైరస్‌ పంజా విసురుతుందని అంచనా వేస్తోంది. అలాంటి పరిస్థితులను నియంత్రించేందుకు ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు వైద్య సిబ్బందికి సూచించారు.



తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ.. పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావుతో కలిసి జిల్లాల ఉన్నతాధికారులు, క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సెలవు రోజుల్లో కరోనా టెస్టులు చేయడం తగ్గిస్తే కరోనా పెరిగే ప్రమాదం ఉంది.. కేసులను ఎప్పటికప్పుడు పరిశీలించాలి అంటూ వారు వెల్లడించారు.. ప్రజలు ఈ మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. ప్రతి ప్రాంతంలోనూ కరోనా అవగాహన శిబిరాలను ఏర్పాటు చేసే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు..

మరింత సమాచారం తెలుసుకోండి: