పేరుకు చిన్న వైరస్..... కానీ ప్రపంచ దేశాల నిత్య జీవితాలు అతలాకుతలం చేసేసింది. ప్రపంచానికే తాళంవేసి... ప్రపంచ దేశ ప్రజలను కదలనివ్వకుండా కలవరపెట్టింది. మాయదారి మహమ్మారి కరోనా వైరస్ చైనా లో పుట్టి ప్రపంచాన్ని చుట్టేసిన సంగతి తెలిసిందే.... ఇక భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికొస్తే. ఆంధ్ర రాష్ట్రాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్.... గతంతో పోల్చుకుంటే.... ఈ మధ్య కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత కొన్నిరోజులుగా తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండడం ప్రజల్ని కలవరపెడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో నిన్న1901 కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో నమోదు అయిన కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తే 2901 గా ఉంది. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 811825కి పెరిగింది. ఇక కోరుకునే వారి సంఖ్య యాక్టివ్ కేసుల సంఖ్య వివరాల్లోకి వస్తే...రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 77900 మంది కోలుకొని క్షేమంగా డిశ్చార్జ్ కాగా 27300 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 19 మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో కరోనాతో మరణించినవారి సంఖ్య 6625కి చేరింది.

అదేవిధంగా నిన్న డిశ్చార్జి అయిన సంఖ్యను చూస్తే... రాష్ట్రంలో డిశ్చార్జిలు కూడా స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 4352 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి ఆనందంగా డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.. ఏదేమైనా కరోనా మహమ్మారి ఇంకా పొంచి ఉందని... ప్రజలు గుర్తించి మరి కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇకపోతే కరోనా వైరస్ వచ్చే నెలలో  ప్రజలకు అందుబాటులోకి  రానుందని వార్తలు వస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: