ప్రస్తుతం దేశాన్ని మొత్తం కరోనా  వైరస్ పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని  నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ దేశ ప్రజలందరూ ఎంతో అవగాహన తెచ్చుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతుంది. ఎంతోమంది ప్రాణాలను కూడా బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి వైరస్. అయితే మొన్నటి వరకు దేశంలో రికార్డుస్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కేవలం రోజుల వ్యవధిలోనే లక్షల కేసులు నమోదయ్యాయి. కానీ ఓవైపు భారతదేశంలో రికవరీ రేటు పెరిగి ఎంతోమంది కరోనా వైరస్ బారిన పడినప్పటికీ చికిత్స తీసుకుని అందులో కోలుకోవటం  అందరిలో ధైర్యాన్ని నింపుతుంది.



 ఇక మరోవైపు కరోనా వైరస్ కేసుల సంఖ్య మునుపటిలా కాకుండా ప్రస్తుతం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ ప్రజానీకం మొత్తం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చు కుంటుంది. ఇప్పటికే దేశ ప్రజానీకం అందరిలో కరోనా వైరస్ పై అవగాహన పెరిగిపోయిన నేపథ్యంలో కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఒకవేళ కరోనా వైరస్ బారిన పడితే ఏం చేయాలి అనే దానిపై కూడా అవగాహన పెరిగి పోతుంది ప్రజల్లో. అయితే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయని భారత ప్రజానీకం మొత్తం ఆనందపడేలోపే  అధికారులందరూ మళ్ళీ హెచ్చరికలు జారీ చేస్తుండడం మళ్లీ ఆందోళనలో ముంచేస్తుంది.



 ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నప్పటికీ భారత్లో మరికొన్ని రోజుల్లో కరోనా సెకండ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు ప్రజలందరినీ హెచ్చరిస్తున్నారు. తొలిదశ కరోనా వ్యాక్సిన్  ఇప్పుడిప్పుడే తగ్గడం మొదలైంది అంటూ చెబుతున్న వైద్య నిపుణులు త్వరలో కరోనా సెకండ్ వేవ్  కూడా ఎదుర్కొనేందుకు అందరు సిద్ధంగా ఉండాలి అని సూచించారు. వచ్చే నెల మూడు నాలుగు వారాల్లో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఒక రోజు మళ్ళి ఒక్కసారిగా కరోనా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటికే అమెరికా ఫ్రాన్స్ సహా మరికొన్ని దేశాల్లో కూడా సెకండ్  వేవ్  మొదలయి ప్రజలందరినీ బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: