దుబ్బాక. ఇపుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ హాట్ టాపిక్. అంతకంటే హీటెక్కించే పాయింట్ కూడా వేరే లేదు. నిజానికి ఆది టీయారెస్ సీటు. అక్కడ రామలింగారెడ్డి బలమైన ఎమ్మెల్యే, ఆయన సడెన్ గా చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇలాంటి ఉప ఎన్నికలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీలకు అవి నల్లేరు మీద నడక లాంటివి. దుబ్బాక విషయం కూడా అంతా అలాగే అనుకున్నారు. ఎందుకంటే దుబ్బాకలో నామినేషన్ వేయడమేంటి గెలుపు మనదే అన్నంత ధీమా టీయారెస్ కి ఉంది.

ఇపుడు కూడా జరిగేది అదే. రిజల్ట్ లో ఏ మాత్రం మార్పు ఉండదు, ఇంత పెద్ద ఎత్తున అధికారం, కేసీయార్, కేటీయార్ చరిష్మా ఉండి కూడా దుబ్బాక గెలవకపోతే  ఎందుకు. పైగా తన సిట్టింగ్ స్థానం అది. దాదాపు ఇలాంటి అంచనాలతోనే దుబ్బాక ఉప ఎన్నిక ముందు టీయారెస్ ఉంది. జనాలు కూడా లైట్ తీసుకున్నారు. కానీ అక్కడ ఎపుడైతే బీజేపీ పోటీకి దిగిందో, బస్తీ మే సవాల్ అంటూ తొడగొట్టిందో నాటి నుంచే ఒక్కసారిగా  దుబ్బాక కాక రేగింది.

దుబ్బాకలో మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా పోటీ చేస్తోంది. కానీ సందడి అంతా టీయారెస్, బీజేపీల మధ్యనే ఉంది.
 తాజాగా బీజేపీ అభ్యర్ధి రఘునందన్ మామ ఇంట్లో దొరికిన నగదు వ్యవహారం, ఆ మీదట పోలీసులు చెప్పిన కధ చెప్పకుండా చేసిన మాటల గారడీ, ఇక  తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ దీక్ష. అరెస్ట్, ఆసుపత్రికి తరలింపు ఇవన్నీ కూడా కమలం పార్టీకి ఒక్కసారిగా హైప్ పెంచేసాయి.

దుబ్బాకలో చాలా ఈజీగా గెలవాల్సిన చోట కమలం పెట్టిన అగ్ని పరీక్షలు ఇవి. ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మరీ అక్కడ పరిస్థితిని వాకబు చేశారంటే దేశంలో బీహార్ ఎన్నికల కంటే కూడా దుబ్బాక ఎంత హీట్ పెంచుతుందో అర్ధం చేసుకోవాలి. ఇక్కడొక విషయం క్లియర్. దుబ్బాకలో కచ్చితంగా టీయారెస్ గెలుస్తుంది. పెద్ద మెజారిటీయే వస్తుంది. కానీ ఆ గెలుపుని వారు అస్వాదించకుండా చేసిన ఘనత మాత్రం బీజేపీదే.  బీజేపీకి  దుబ్బాకలో చాలా బలముంది, కానీ అధికార పార్టీయే ఏదో చేసి గెలిచిందన్న ఫీలింగ్ ని ఇప్పటికే జనాల్లో పంపడంలో కమలనాధులు సక్సెస్ అయ్యారు. ఇది చాలదూ అసలు గెలుపు ఎవరిదో చెప్పడానికి.

మరింత సమాచారం తెలుసుకోండి: