ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే బిజెపి రాజకీయంగా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో బలపడే విషయంలో కాస్త ఇబ్బంది పడుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అక్కడున్న నాయకులు పనితీరు కారణంగానే ఇబ్బందులు పడుతున్నామని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సోము వీర్రాజు పై బీజేపీ అధిష్టానం సీరియస్ గా ఉందని కొంతమంది వ్యాఖ్యనిస్తున్నారు.

అంతేగాకుండా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిపై కేరళ బీజేపీ అధ్యక్షుడిపై కూడా ఇప్పుడు బీజేపీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది వీరి పని తీరు కారణంగా ఆయా రాష్ట్రాల్లో బలోపేతం కాలేకపోతున్నామని భావిస్తున్నారు. సోము వీర్రాజు ఇటీవల రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత మందికి కొమ్ముకాస్తున్నారు అనే ఆరోపణలు బీజేపీ నేతలు చేస్తున్నారు. ఇటీవల పార్టీకి చెందిన ఒక కీలక నేత టీవీ డిబేట్ లో పాల్గొన్నారని ఆయనను సస్పెండ్ చేయడంతో తీవ్ర దుమారం రేగింది. అంతకుముందు వెలగపూడి గోపాలకృష్ణ అనే నాయకుడుని కూడా ఇదే విధంగా సస్పెండ్ చేశారు.

దీంతో బీజేపీ నేతలు కూడా సోము వీర్రాజు పని తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత పార్టీలో ఎవరూ రాలేదు అని కానీ పార్టీ నుంచి మాత్రం కొంతమంది వెళ్లిపోయారని మరికొంతమంది నేతలు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం కాస్త హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఏపీలో బీజేపీకి అలాంటి అవకాశాలు కూడా లేవు. మరి సోము వీర్రాజు ఇదే విధంగా వ్యవహరిస్తే ఆ పార్టీ పరిస్థితి అంతకంతకు దిగజారే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: