తెలంగాణలో గనుక ఇప్పుడు బిజెపి దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిస్తే మాత్రం పరిణామాలు చాలా మారే అవకాశాలు స్పష్టంగా ఉండవచ్చు. ప్రధానంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడాలి అని భావిస్తుంది కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే తనకు అనుకూలంగా ఫలితం వచ్చే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది. బిజెపి మొదటి స్థానంలో నిలిచి విజయం సాధించినా... లేకపోతే రెండో స్థానంలో ఉండే టిఆర్ఎస్ పార్టీ గట్టిపోటీ ఇచ్చిన సరే పరిణామాలు వేగంగా మారే అవకాశాలు ఉండవచ్చు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా కాస్త జాగ్రత్త పడుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు బీజేపీ మరికొన్ని వ్యూహాలతో ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ప్రచారం కోసం ఇప్పుడు బీజేపీ కీలక నేత వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి దుబ్బాక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.

దక్షిణాదికి చెందిన ఒక యువ నేతను ఉప ఎన్నికల్లో ప్రచారానికి పిలిచే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇక ఇదే సమయంలో కొంత మంది నేతలను కూడా తమ వైపు తిప్పుకునే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో కొంతమందికి టీఆర్ఎస్ నేతలను తమ వైపు తిప్పుకునే విధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. మరి ఎవరు మారుతారు ఏంటి అనేది త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తెరాస పార్టీని ఎదుర్కొని ఇప్పుడు తెలంగాణలో బీజేపీ రాజకీయం చేయడం అనేది కాస్త కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: