ఏపీలో మరో రాజకీయ రచ్చకు తెర లేచింది. ఏపీలో స్థానిక సంస్థల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నించడం ఈ రచ్చకు కారణం.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం పార్టీలతో ఇవాళ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో సమావేశం కాబోతోంది. కరోనా దృష్ట్యా పార్టీల ప్రతినిధులతో  వేర్వేరుగా నిమ్మగడ్డ భేటీకానున్నారు. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను సేకరించనున్నారు.

అయితే అధికార వైసీపీ ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. అసలు ఎన్నికల కమిషనర్ ఎన్నికలు నిర్వహించాలంటే.. అందుకు అనువైన వాతావరణం ఉందా.. లేదా అని ప్రభుత్వం అభిప్రాయం తీసుకోవాలి కదా.. ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలి కదా.. ఇప్పటి వరకూ నిమ్మగడ్డ అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదన్నది సర్కారు వాదన.. అందులోనూ లాజిక్ ఉంది. అయితే ప్రభుత్వం తనకు సహకరించడం లేదనే కదా కొన్నిరోజులుగా నిమ్మగడ్డ వాదిస్తున్నాడు. అందుకే పార్టీ నుంచి అభిప్రాయం తీసుకుని తర్వాత ప్రభుత్వాన్ని సంప్రదిస్తారేమో తెలియదు.

ఏదేమైనా నిమ్మగడ్డ పదవీ కాలం ఇంకా 5 నెలల వరకూ ఉంది. అప్పటి వరకూ ఎన్నికల ఊసు ఎత్తకూడదన్నది సర్కారు అభిప్రాయం.. తాను దిగిపోయేలోపు ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలన్నది నిమ్మగడ్డ పట్టు. దీంతో మరోసారి ఏపీలో మరోసారి నిమ్మగడ్డ వర్సస్‌ ఏపీ సర్కారు వ్యవహారం కనిపిస్తోంది.  విచిత్రం ఏంటంటే.. కరోనా ఒక్క కేసు ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టాల్సిందే అని జగన్ అన్నాడు.. అప్పుడు కుదరదని నిమ్మగడ్డ అన్నాడు.. ఇప్పుడు వేల కేసులు వస్తుంటే.. ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ చూస్తున్నాడు.. జగన్ మాత్రం అబ్బే ఇప్పుడు కుదరదు అన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు.

ఇప్పటికే ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు పెట్టే ఆలోచన లేదని మరో మంత్రి కొడాలి నాని క్లారిటీ ఇచ్చేశారు. క‌రోనా ఏమీ లేన‌ప్పుడు స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌ను వాయిదా వేసి, ఇప్పుడు దాని ప్రభావం ఎక్కువ‌గా ఉన్నప్పుడు జ‌రిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడం ఏంటని నాని విరుచుకుప‌డ్డారు. మ‌రో కొన్ని నెల‌లు మాత్రమే నిమ్మగ‌డ్డ త‌న ప‌ద‌విలో కొన‌సాగుతార‌ని చెప్పడం ద్వారా ఆయన దిగిపోయేవరకూ ఎన్నికలు పెట్టబోమని తేల్చి చెప్పేశారు. అంతే కాదు.. ప్రభుత్వాన్ని సంప్రదించ‌కుండా నిమ్మగడ్డ ఏమీ చేయ‌లేర‌ని... రాష్ట్రంలో ఎన్నిక‌లు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాల‌ని, అలా కాకుండా తానే నిర్వహిస్తాన‌ని ఎన్నిక‌ల సంఘం అనుకుంటే జ‌రిగే ప‌ని కాద‌ని కూడా తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: