ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రైతులకు సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలు హాట్ టాపిక్ గా మారాయి. చరిత్రలో ఎవరూ చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతంగా అమలు చేస్తున్నారు. రాజకీయంగా ఎవరైనా విమర్శలు చేసినా సరే ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే రైతుల కోసం ఆయన ప్రతి ఒక్కటి కూడా చాలావరకు శ్రద్ధ పెట్టి చేస్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు సీఎం జగన్ మరో కార్యక్రమానికి కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

రైతులు పిల్లలు చదువుకునే విధంగా ఆయన కొన్ని కార్యక్రమాలను తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకునే పిల్లల కోసం ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలను ప్రవేశ పెట్టే విధంగా సీఎం జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అమ్మఒడి తరహాలో ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకునే చిన్న చిన్న పిల్లలకు ఆర్థిక సహాయం కూడా చేసే విధంగా సీఎం జగన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే ఇది కాస్త విభిన్నంగా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా రైతుల పిల్లలు ఎగ్జామ్ ఫీజు లు తదితర ఫీజులు కట్టి విషయంలో కాస్త ఇబ్బందులు పడుతుంటారు.

ఈ నేపథ్యంలో వారి కోసం సీఎం జగన్ ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి అందించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ఆయన విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత కూడా లేదు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని దీన్ని వచ్చే ఏడాది బడ్జెట్లో ప్రవేశపెట్టి అప్పటి నుంచి అమలు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: