రెండు రోజుల క్రితం దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ మరియు వారి బంధువుల ఇంట్లో దొరికిన నగదు విషయంలో ప్రభుత్వానికి మరియు బీజేపీ కి జరుగుతున్న వివాదం తెలిసిందే. బీజేపీ కార్యకర్తలు ఎంత వివాదాన్ని సృష్టించారో ఎందరో చూసారు. అయితే జాతీయ పార్టీ అయిన బీజేపీ ఈవిధంగా చేయడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. దీనికి బీజేపీ నాయకులూ కొంతమంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆరోపణాలు చేస్తున్నారు. దీనిపై మంత్రి తలసాని యాదవ్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుబ్బాక ఎన్నికలకే హైలైట్ గా నిలిచాయి.

మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ    బీజేపీ అధికార మోహంతో చేయవలసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు ఈ విధమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. మీరు పద్ధతి మార్చుకోకపోతే బాగుండదని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత‌ ప్రజల భవిష్యతే ప్రధాన లక్ష్యంగా అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేక బీజేపీ నేతలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. . బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సమీప బంధువు ఇంట్లో డబ్బు దొరికినట్టు సిద్దిపేట సీపీ విడుదల చేసిన వీడియోలో స్పష్టమవుతుంటే ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరుగుతున్నాయని విమర్శలు చేయడం బీజేపీ నేతల అవివేకానికి నిదర్శనమన్నారు.  అయినా బీజేపీ మరియు కాంగ్రెస్  పార్టీలు ఎంత ప్రయత్నించినా గెలిచేది మాత్రం తెరాస అని, ప్రజలు మాకు ఎప్పుడూ మద్దతుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియచేసారు.

కేంద్రంలో అధికారంలో  ఉన్నాం కదా అని మిగిలిన రాష్ట్రాల్లో ఆధిపత్యం చెలాయించినట్టు మా తెలంగాణలో చేస్తే కుదరదని హెచ్చరించారు. తెరాస లో అత్యధికంగా  ‘60 లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారని... ఒక్కసారి సంస్కారాన్ని పక్కకు పెడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి’ అంటూ చురక అంటించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యతాయుతమైన పదవిలో ఉంది కనీసం ఏమిజరిగిందో తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయడం ఆయన సంస్కారానికి వదిలేస్తున్నామని ఎద్దేవా చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: