దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ఏమో గాని ఇప్పుడు తెరాస పార్టీ చేస్తున్న విమర్శలతో విపక్షాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి.  ప్రధానంగా హరీష్ రావు  కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేసారు. దుబ్బాక రోడ్ షో లో ఆయన మాట్లాడారు. దొమ్మట రోడ్ షోలో పాల్గొన్న ఆయన... కాంగ్రెస్ ఏం చేసిందని ఓట్లడుగుతారు ? అని నిలదీశారు.   కరెంటు, ఎరువులు విత్తనాలు ఇవ్వనందుకు కాంగ్రెస్ కు ఓటు వెయ్యాలా..? ఆయన ప్రశ్నించారు రాష్ట్ర సంక్షేమ పథకాలకు బీజేపీ ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. అని ఆయన మండిపడ్డారు.

ఓటర్లకు  పంచేందుకు  డబ్బు తెచ్చి బహిరంగంగా దొరికిపోయి.. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా భారతీయ జనతా పార్టీ  నేతలు గగ్గోలు పెడుతున్నరు అని ఆయన మండిపడ్డారు. పోలీసులు వీడియోలు బయట పెట్టడం తో బీజేపీ నేతలు మొఖం నెలకు వేసిండ్రు అని ఆయన విమర్శలు చేసారు. బీజేపీ అంటే భారతీయ ఝూట పార్టీ గా మారి పోయింది అని ఆయన విమర్శించారు. బిజెపి  దొంగ ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు అని ఆయన సూచించారు. పెద్ద నోట్ల ను రద్దు చేసి పేద ప్రజల నడ్డి విరిచింది బీజేపీ అని మండిపడ్డారు.

ఎండమావులను చూసి మోస పోవద్దు అని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ.. బీడీ ల కట్ట లపై పుర్రె గుర్తు పెడితే.. బిజెపి జీఎస్టీ విధించింది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. కొత్త రెవిన్యూ చట్టం ద్వారా పేద నిరుపేద రైతుల పేరిట పట్టాలు చేసి వారిని ఆదుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో అటు బిజెపి కూడా చాలా వరకు దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారాన్ని లైట్ తీసుకోకుండా ముందుకు సాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: